ప్రకాశం జిల్లాలో రామాలయ జీర్ణోద్ధరణకు శంకుస్థాపన చేసిన తితిదే ఇఓ కృష్ణారావు

ప్రకాశం జిల్లాలో రామాలయ జీర్ణోద్ధరణకు శంకుస్థాపన చేసిన తితిదే ఇఓ కృష్ణారావు

 తిరుపతి, మార్చి-21, 2011: ప్రకాశం జిల్లాలోని కొండేపిలో వెలసియున్న పురాతన శ్రీ కోదండరామస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి సోమవారంనాడు తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
             
సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర వున్న ఈ దేవాలయానికి పూర్వవైభవాన్ని తీసుకురావడంలో భాగంగా జనవరి మాసంలో జరిగిన సాధికార మండలి సమావేశంలో (ప్రతిపాదన నెం.260, తారీఖు 20 జనవరి,2011) ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.
 
ఈ మేరకు రూ.31.25 లక్షలతో తితిదే శ్రీ వెంకటేశ్వర దేవాలయ వారసత్వ పరిరక్షణ ట్రస్టు (ఐజీరి ఙలిదీదిబిశిలిరీగీబిజీబి కలిజీరిశిబివీలి ఆజీలిరీలిజీఖీబిశిరిళిదీ ఊజీతిరీశి) ద్వారా జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాగా ఈ మొత్తం వ్యయంలో రూ.25 లక్షలు తితిదే వెచ్చిస్తూండగా మిగిలిన రూ.6.25 లక్షలను ఆలయ దేవాలయ కమిటీ భరిస్తున్నది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాయింటు కలెక్టర్‌ శ్రీ లక్ష్మీనారాయణ, ఆలయ ప్రముఖులు, గ్రామ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.