ESSENCE OF GITA IS ULTIMATE TO LEAD A RIGHTEOUS LIFE- JEO _ ప్రపంచ మానవాళి మార్గదర్శి భగవద్గీత- గీతా సారాన్ని అర్థం చేసుకుని ఆచరించాలి_ రాష్ట్ర స్థాయి విజేతల బహుమతి ప్రధాన సభలో టీటీడీ జ్ఈవో శ్రీ వీర బ్రహ్మం

TIRUPATI, 29 DECEMBER 2021: The essence of Bhagavat Gita is to lead a righteous life and everyone should try to catch that and apply the same in their daily life for an ethical living said, TTD JEO Sri Veerabrahmam.

 

On the occasion of Gita Jayanthi on December 14, district level competitions were held under the aegis of the HDPP wing of TTD.

 

The state-level competitions to the winners in the district level was held in Mahati Auditorium on Wednesday.

 

In the evening prizes were distributed. Speaking on the occasion the JEO said Gita preaches “Do not think of results only execute your work with utmost devotion and faith. And also learns one on how to face problems with courage.

 

All projects special officer Sri Vijayasaradhi, Principal, Oriental College of Hyderabad Sri Hemanth Kumar, AEO Sri Satyanarayana and others were also present.

 

Later prizes were distributed to state level winners of Gita Shloka competition.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రపంచ మానవాళి మార్గదర్శి భగవద్గీత

– గీతా సారాన్ని అర్థం చేసుకుని ఆచరించాలి

– రాష్ట్ర స్థాయి విజేతల బహుమతి ప్రధాన సభలో టీటీడీ జ్ఈవో శ్రీ వీర బ్రహ్మం

తిరుపతి 29 డిసెంబరు 2021: భగవద్గీత ప్రపంచ మానవాళి జీవన మార్గదర్శి అని టీటీడీ జెఈవో శ్రీ వీర బ్రహ్మం చెప్పారు. గీతా సారాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా డిసెంబరు 14వ తేదీ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగుళూరు, గురువాయూరు లో జిల్లా స్థాయి లో భగవద్గీత 17వ అధ్యాయం, 700 శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు బుధవారం తిరుపతి మహతి కళాక్షేత్రం లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. విజేతలకు సాయంత్రం బహుమతి ప్రధాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ వీర బ్రహ్మం ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న తనం నుంచే సనాతన హిందూ ధర్మ భావనలు అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తామన్నారు. టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ఇలాంటి కార్యక్రమాలను ఎంతో ప్రోత్సాహిస్తున్నారని తెలిపారు. నిజమైన జ్ఞానం గురించి తెలుసుకుని, మంచికర్మలు చేయడానికి భగవద్గీత ఉపకరిస్తుందన్నారు. మంచి పనులు చేయడం, ఫలితం ఎలా వచ్చినా స్థిత ప్రజ్ఞతతో స్వీకరించడం అలవరచుకోవాలన్నారు. జీవితం మీద ఎక్కువ కోరికలతో కూడిన అంచనాలు లేకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడమే గీతాసారమని జెఈవో వివరించారు. పోటీల్లో పాల్గొన్న వారందరూ విజేతలే నని చెప్పారు.

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టుల సమన్వయ కర్త శ్రీ విజయ సారథి, హైదరాబాద్ ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీ హేమంత్ కుమార్, డిపిపి ఎ ఈవో శ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారిని శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం అందించారు.

17వ అధ్యాయం కంఠస్థ పోటీల విజేతలు వీరే

6, 7 తరగతుల విభాగం

మొదటి బహుమతి
సి హెచ్ కావ్యజ్ఞ (చెన్నై) 20గ్రాముల వెండి డాలర్,

ద్వితీయ బహుమతి
ఎ. స్వామినాథన్ (తిరుపతి)
15 గ్రాముల వెండి డాలర్

తృతీయ బహుమతి
జి.నివిశ్రీ ( హైదరాబాద్)
10 గ్రాముల వెండి డాలర్

8, 9 తరగతుల విభాగం

మొదటి బహుమతి
జె. యశస్వి (శ్రీకాకుళం)
20 గ్రాముల వెండి డాలర్

ద్వితీయ బహుమతి
పి.విజిత (ప్రకాశం)
15 గ్రాముల వెండి డాలర్

తృతీయ బహుమతి
లక్ష్మీ వాగ్దేవి ( హైదరాబాద్)
10 గ్రాముల వెండి డాలర్

700 శ్లోకాల కంఠస్థ పోటీలు 18 సంవత్సరాల లోపు విభాగం

మొదటి బహుమతి
కె ఎం గౌరి ( బెంగుళూరు)
రూ 10 వేల నగదు

ద్వితీయ బహుమతి
ఎ సి కె సాహితి (ఖమ్మం)
రూ 7500 నగదు

తృతీయ బహుమతి
శ్రీపాద లీలా మాధవ్ ( హైదరాబాద్)
రూ 5000 నగదు

కన్సోలేషన్ రూ 516 నగదు
వి. విశ్వజిత్ ( చెన్నై)
బి.దాక్షాయణి ( మహబూబ్ నగర్)
భువనశ్రీ ( పశ్చిమగోదావరి)

18 సంవత్సరాల పైబడిన విభాగం

మొదటి బహుమతి

రమ్య మంగళ లక్ష్మి ( బెంగుళూరు)
రూ 10 వేల నగదు

ద్వితీయ బహుమతి
శ్రీమతి ఎం.లక్ష్మి కుమారి ( మెదక్)
రూ 7500 నగదు

తృతీయ బహుమతి
డి.నాగ శిరీష ( ఏలూరు)
రూ 5000 నగదు

విజేతలందరినీ శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం, సర్టిఫికెట్ అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.