TTD TO CONDUCT SRI KALYANAMASTU PROGRAM IN EVERY CONSTITUENCY _ ప్ర‌తి నియోజ‌క వ‌ర్గంలో క‌ల్యాణ‌మ‌స్తు

-TTD EO DIRECTS TO BEGIN REGISTRATION FOR FREE WEDDINGS

Tirupati, 30 Mar. 21: Tirupati, 30 Mar. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy has directed officials to commence registration of applications from every assembly constituencies in AP for performing the unique Sri Kalyanamastu – free mass marriage program in total adherence to Covid guidelines.

Addressing a review meeting at TTD administrative building on Tuesday evening the TTD EO said that Kalyanamastu program will be held on May 28 at 12.34pm to12.40pm hours in the Mula nakshatram of the Vaishaka masa Bahula Vidiya Friday of the Sri Plavanama samvatsaram.

He asked officials to make arrangements for wedding of 300 sets of youth in each district and coordinate efforts with the Collectors and district administration.

He also instructed the officials to commence registrations and also keep ready 2 gm of gold mangala sutras, pattu vastrams, silver foot rings, Pustaka Prasadam, laminated portrait of Sri Padmavati & Srinivasa, annaprasadam etc.

TTD JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, FA and CAO Sri O Balaji, CE Sri Ramesh Reddy, HDPP secretary Acharya Rajagopalan and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ప్ర‌తి నియోజ‌క వ‌ర్గంలో క‌ల్యాణ‌మ‌స్తు

– జంట‌ల న‌మోదు ప్ర‌క్రియ వెంట‌నే ప్రారంభించాలి – టిటిడి ఈవో

తిరుపతి, 2021  మార్చి 30: టిటిడి త‌ల‌పెట్టిన ఉచిత సామూహిక వివాహా‌ల ( క‌ల్యాణ‌మ‌స్తు) కార్యక్ర‌మాన్ని కోవిడ్ – 19 నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ కేంద్రంలో నిర్వ‌హించ‌డానికి ఏర్పా‌ట్లు చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

తిరుప‌తి ప‌రిపాల‌న భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సాయంత్రం క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మం ఏర్పాట్ల‌పై అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు.  మే 28వ తేదీ శ్రీ ప్ల‌వ‌నామ సంవ‌త్స‌రం వైశాఖ మాస బ‌హుళ విదియ శుక్ర‌వారం మూల న‌క్ష‌త్రం సింహ ‌లగ్నంలో  మ‌ధ్యాహ్నం 12.34 నుండి 12.40 మ‌ధ్య సామూహిక వివాహ‌లు నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింద‌న్నారు. అయితే కోవిడ్ – 19 ప‌రిస్థితుల కార‌ణంగా జిల్లా కేంద్రాల్లో ఒకే చోట ఎక్కువ మంది జ‌నం గుమికూడ‌టం వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుద‌ని చెప్పారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌తి నియోజ‌క వ‌ర్గ కేంద్రంలో క‌ల్యాణ‌మ‌స్తు నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు.

ప్ర‌తి జిల్లాలో  క‌నీసం 300 జంట‌ల వివాహా‌లు చేయ‌డానికి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా క‌లెక్ట‌ర్ల స‌హ‌కారం కోరుతూ లేఖ‌లు రాయాలని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. జంట‌ల న‌మోదు ప్ర‌క్రియ వెంట‌నే ప్రారంభించాల‌న్నారు. వివాహం చేసుకునే జంట‌ల‌కు రెండు గ్రాముల మంగ‌ళ‌సూత్రం, వ‌స్త్రాలు, వెండి మెట్టెలు, పుస్త‌క ప్ర‌సాదం, శ్రీ ప‌ద్మావ‌తి శ్రీ‌నివాసుల ల్యామినేష‌న్ ఫోటో, భోజ‌నాలు త‌దిత‌ర ఏర్పాట్లు సిద్ధం చేయాల‌న్నారు. ఏప్రిల్ చివ‌రిలో క‌ల్యాణ‌మ‌స్తుపై మ‌రోసారి స‌మీక్షించ‌నున్న‌ట్లు ఈవో చెప్పారు.

జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.‌‌