TONDAMANDU BTUs FROM FEB 20 _ ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు తొండమనాడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు 

TIRUPATI, 05 FEBRUARY 2023: The annual Brahmotsavams in Tondamanadu temple will be observed between February 20 to 28 with Ankurarpanam on February 19.

The annual fete in this ancient Sri Devi Bhu Devi Sameta Sri Venkateswara Swamy temple will commence with Dhwajarohanam on February 20. The important days includes Kalyanotsavam and Garuda Seva on February 24 and Chakrasnanam on February 28. On March 1, Pushpa Yagam will be performed from 5.30pm onwards.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 
ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు తొండమనాడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
 
తిరుపతి, 05 ఫిబ్రవరి 2023: టిటిడికి చెందిన తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 19న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
 
ఫిబ్రవరి 20న ఉదయం 8 నుండి 9 గంటల మధ్య ధ్వజారోహణంతో  బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేష వాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న హంస వాహనం, ఫిబ్రవరి 22న సింహ వాహనం, ఫిబ్రవరి 23న హనుమంత వాహనం, ఫిబ్రవరి 24న సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ, ఫిబ్రవరి 25న గజవాహనం, ఫిబ్రవరి 26న చంద్రప్రభ వాహనం, ఫిబ్రవరి 27న ఉదయం తిరుచ్చి, రాత్రి ఆశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. 
 
ఫిబ్రవరి 28న ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 6.30 నుంచి 8 గంటల వరకు ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 1న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.