RAMAKRISHNA THEERTHA MUKKOTI HELD _ వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

TIRUMALA, 05 FEBRUARY 2023: The torrent festival in the auspicious Magha month, Sri Ramakrishna Theertha Mukkoti was held with spiritual fervour on Sunday. 

Considered as one of the most important Muktiprada Theerthas among the Sapta Theerthas, Sri Ramakrishna Theertham was believed to have been named after Sri Ramakrishna Maharshi who consecrated the idols of Sri Rama and Sri Krishna here.

Located in the deep woods of Seshachala ranges, the Ramakrishna Theertham is almost 8.5km away from Tirumala temple. The devotees believe that taking a holy dip in the fresh waters of this torrent on the auspicious day of Magha Pournami will yield them salvation. 

A team of temple staff amidst chanting of Veda mantras by the religious staff reached Sri Ramakrishna Theertham from Tirumala temple at 9am. Later they performed special Abhishekam to the deities located here and returned to the temple.

TTD made elaborate arrangements for the devotees who trekked Sri Ramakrishna Theertham. The distribution of beverages, buttermilk, Annaprasadam and water commenced at 5am in the Papavinasanam Dam area. Hundreds of devotees trekked the torrent path. The Engineering department officials laid strong ladder for the sake of devotees to reach the torrent point.

In coordination with Police, TTD vigilance and forest muzdoors provided security to the devotees all along the route. APSRTC operated 30 buses at every 5 minutes to transport devotees to Papavinasanam. Private taxis and jeeps were not allowed beyond Gogarbham dam point as there is limited space for parking. The entry was closed after 12 noon for devotees.

Medical teams were placed at three points with an ambulance at Papavinasanam Dam. Over 100 Srivari Sevaks were deployed to provide food and water services to the devotees from 5am to 6pm.

All the officials of the concerned departments in TTD, Police, RTC supervised their respective activities and ensured smooth trekking for hundreds of pilgrims who hailed from Tamilnadu and Karnataka also besides locals.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

తిరుమల, 2023 ఫిబ్రవరి 05,: తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి ఆదివారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పించారు.

రామ‌కృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్‌ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పోలీసుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్‌, ఫారెస్ట్‌ మజ్దూర్‌లు భక్తులకు దారి పొడవునా భద్రత ఏర్పాటు చేశారు. పాపవినాశనానికి భక్తులను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చొప్పున 30 బస్సులను నడిపింది. పాప వినాశనం వద్ద పార్కింగ్‌కు స్థలం పరిమితంగా ఉన్నందున గోగర్భం డ్యాం పాయింట్ దాటి ప్రైవేట్ ట్యాక్సీలు మరియు జీప్‌లను అనుమతించలేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేశారు.

పాపవినాశనం డ్యాం వద్ద అంబులెన్స్‌తో పాటు మూడు పాయింట్ల వద్ద వైద్య బృందాలను ఉంచారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలను అందించేందుకు 100 మంది శ్రీవారి సేవకులను నియమించారు.

టీటీడీ, పోలీస్, ఆర్టీసీలోని సంబంధిత విభాగాల అధికారులందరూ సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానికులతో పాటు తమిళనాడు మరియు కర్ణాటక నుండి వచ్చిన వందలాది మంది యాత్రికులకు ట్రెక్కింగ్ సాఫీగా జరిగేలా చూసారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.