ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేది వరకు హైద్రాబాద్‌లో శ్రీనివాస కల్యాణాలు 

ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేది వరకు హైద్రాబాద్‌లో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, ఫిబ్రవరి 21, 2013: తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు జంటనగరాలైన హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌ పరిసర ప్రారతాలల్లో ఎనిమిది చోట్ల శ్రీనివాస కల్యాణాలు వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తితిదే రాష్ట్రంలోనే గాక దేశవిదేశాలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 24వ తేది హైద్రాబాద్‌ నగరంలో సీతారమ్‌బాగ్‌ ద్రోపది గార్డెన్స్‌లో శ్రీ అనీల్‌ కుమార్‌  అధ్వర్యంలో, ఫిబ్రవరి 26వ తేదీ మధురానగర్‌లోని  శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నారు.
అదేవిధంగా ఫిబ్రవరి 27వ తేదీ రంగారెడ్డి జిల్లా షమీర్‌పేటలో రత్నాలయం చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యకక్షులు శ్రీ టి.ఆర్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో, ఫిబ్రవరి 28వ తేదిన నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణాలు వైభవంగా జరగనుంది.
 
మార్చి ఒకటి తేదిన హైద్రాబాదు నగరంలో శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కమిటి ఆధ్వర్యంలో, మార్చి 2వ తేదిన సికింద్రాబాదు నగరం శ్రీట్యాడ్‌బండ్‌ వీరాంజనేయస్వామి దేవస్థానం ఆలయ కమిటి ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాలు ఘనంగా జరగనుంది.
 
మార్చి 3వ తేదిన హైద్రాబాద్‌ నగరంలో శ్రీ షామ్‌ మందిర సేవ సమితి ఆలయ కమిటి ఆధ్వర్యంలో, మార్చి4వ తేదిన సికింద్రాబాద్‌ నగరంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీ భవాని శంకరాలయంలో స్వామివారి కల్యాణాలు కనులపండుగగా నిర్వహించనున్నారు.
సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసాల కోర్చి తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకోలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.రామక్రిష్ణ ఈ ఏర్పాట్లును పర్యవేక్షిస్తారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.