FREE BIRRD CAMPS ALL ACROSS AP SOON- TTD CHAIRMAN _ బర్డ్ వైద్య శిబిరానికి భారీ స్పందన

Tirumala, 20 Mar. 21: On the directions of AP CM Sri YS Jaganmohan Reddy, the TTD is poised to conduct BIRRD medical camps all over the state soon to provide free treatment including artificial limbs, said TTD Chairman Sri YV Subba Reddy.

After inaugurating a one-day free medical camp of BIRRD hospital at Markapur in Prakasam district on Saturday the Chairman said thousands of sick people from Giddalur, Erragondapalem and Markapur are benefited from the free camp managed by specialist doctors of BIRRD hospital.

He said it is the vision of AP CM to avoid people from debt trap for medication by offering quality Medicare at their doorsteps.

He said besides consultations on bone and knee ailments medicines and surgeries are also being offered to the needy and artificial limbs given free to patients on doctor’s advice as well.

AP minister Sri A Suresh, legislators Sri Nagarjuna Reddy, Sri A Rambabu, Markapur Municipal Chairman Sri HL Balamurali Krishna, Honorary Director of BIRRD hospital Dr Madan Mohan Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బర్డ్ వైద్య శిబిరానికి భారీ స్పందన

– మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండ పాలెం నుంచి తరలి వచ్చిన ప్రజలు
– రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ వైద్య శిబిరాలు. : చైర్మన్

తిరుమల 20 మార్చి 2021: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శనివారం బర్డ్ ఆసుపత్రి నిర్వహించిన వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. వేలాదిగా తరలి వచ్చిన ప్రజలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సాయంత్రం 6 గంటల వరకు వైద్య పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ వైద్య శిబిరాలు : చైర్మన్

వైద్యం కోసం ఎవ‌రూ అప్పుల‌పాలు కాకూడ‌ద‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌నమోహన్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఉద్దేశంతోనే సిఎం రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద పీట వేశార‌ని చెప్పారు. టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ శిబిరంలో ఎముకలు, కీళ్ళ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నారని చెప్పారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా చేస్తారని చైర్మన్ తెలిపారు. వైద్యులు సిఫారసు చేసిన వారికి కృత్రిమ కాళ్ళు, చేతులు అందిస్తారని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

సిఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం మేరకు బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నామని చెప్పారు. ఇందులోభాగంగా తొలిగా మార్కాపురంలో వైద్య శిబిరం నిర్వహించామని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు.

కార్య‌క్ర‌మంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్, ఎమ్మెల్యేలు శ్రీ నాగార్జున రెడ్డి, శ్రీ అన్నా బత్తుని రాంబాబు, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ శ్రీ సి హెచ్ బాల మురళీ కృష్ణ, బర్డ్ ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.