TTD TEAM VISITS BARAMATI KRISHI VIGNANA KENDRA _ బారామతి కృషి విజ్ఞాన కేంద్రంలో టీటీడీ అధికారులు బృందం పరిశీలన 

TIRUPATI, 22 FEBRUARY 2023: With an aim to develop TTD-run Sri Venkateswara Dairy Farm to high standards, a team of TTD officials led by JEO (H&E) Smt Sada Bhargavi inspected the famous Krishi Vignana Kendra at Baramati on Wednesday.

 

The officers team verified and observed the process of high milch-yielding cows through Embryo transfer technology deployed in the Centre.

 

The farmers are being trained over new techniques in Horticulture, Floriculture, Agriculture.

 

The JEO learnt the training logistics deployed by the Centre.

 

CE Sri Nageswara Rao, Dairy Farm Director Dr Harnath Reddy, Veterinary University Extension Director Dr Venkata Naidu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

బారామతి కృషి విజ్ఞాన కేంద్రంలో టీటీడీ అధికారులు బృందం పరిశీలన

తిరుపతి 22 ఫిబ్రవరి 2023: దేశీయ గోజాతుల అభివృద్ధి, డెయిరీల నిర్వహణపై మహారాష్ట్రలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న టీటీడీ అధికారుల బృందం బుధవారం బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించింది.

టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి నేతృత్వంలో చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకట నాయుడు బృందం మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రం లో క్షేత్ర స్థాయి అధ్యయనం చేసింది. జన్యు ప్రక్రియ ద్వారా దేశీయ గోజాతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా ఈ బృందం పరిశీలించింది. దేశీయ గో జాతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య పద్ధతులు, స్వచ్ఛమైన పాల దిగుబడికి అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. ఇందుకు అవసరమయ్యే మౌళిక వసతులను టీటీడీ అధికారులు బృందం పరిశీలించింది. టీటీడీ గోశాలలో రోజుకు 4 వేల లీటర్ల స్వచ్ఛమైన దేశ వాళీ ఆవు పాలను దిగుబడి చేసుకోవడానికి అనుసరించవలసిన విధానాలపై అక్కడి అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. బారామతి కృషి విజ్ఞాన కేంద్రంలో పశువైద్యం, హార్టీకల్చర్, అగ్రికల్చర్, ఫ్లోరీకల్చర్ పై రైతులకు నూతన మెళకువలు, సాంకేతికను జోడించి సంప్రదాయ వ్యవసాయం చేయడంపై నిపుణులు శిక్షణ ఇస్తూఉంటారు. టీటీడీ గోఆధారిత ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తూ, వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారుల బృందం అక్కడి శిక్షణా తరగతుల తీరును పరిశీలించింది.

రైతులను సంప్రదాయ వ్యవసాయం వైపు ప్రోత్సహించడానికి అక్కడి అధికారులు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనేక అంశాలపై అధికారులతో చర్చించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది