SRINIVASA KALYANAM IN BENGALURU ON DECEMBER 16 _ బెంగళూరులో డిసెంబరు 16న శ్రీనివాస కల్యాణం విజయవంతంగా నిర్వహించాలి

JEO (E & H) INSPECTS THE ARRANGEMENTS

TIRUPATI, 08 DECEMBER 2022: TTD is gearing up to perform the celestial Srinivasa Kalyanams in Rama Nagar Stadium in Bengaluru on December 16.

In connection with this event, TTD JEO for Education and Health Smt Sada Bhargavi inspected the ongoing arrangements for the same on Thursday. 

She discussed with the officials concerned over the floral decorations, illumination, stage works, barricading, security etc. to be made for the mega religious fete and given some suggestions. She instructed the TTD officials to coordinate with the local administration for making the elaborate arrangements for the event. 

She also reviewed on the entry and exit gates to be arranged for VIPs, seating arrangements to be done for the devotees, live coverage on SVBC etc.

SE Sri Jagadeeshwar Reddy, DE Sri Ravishankar Reddy, VGO Sri Manohar, SVETA Director Smt Prasanthi, on behalf of former CM of Karnataka Sri Kumaraswamy who will be sponsoring the mega religious event his representative Sri Aswin, Karnataka Police participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

బెంగళూరులో డిసెంబరు 16న శ్రీనివాస కల్యాణం విజయవంతంగా నిర్వహించాలి

– రామనగర స్టేడియంలో ఏర్పాట్లపై పరిశీలించిన టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 8 డిసెంబరు 2022: బెంగుళూరు మహానగరంలోని రాంనగర స్టేడియంలో డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6నుండి రాత్రి 8 గంటల వరకు జరిగే శ్రీనివాసకల్యాణం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులకు సూచించారు.

స్టేడియంలో చేయాల్సిన ఏర్పాట్లను గురువారం ఆమె అధికారులతో కలసిపరిశీలించారు. వేదిక నిర్మాణం, విద్యుత్, పుష్పాలంకరణలు, భద్రత ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. స్వామివారి కల్యాణం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల పై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసు అధికారులతో చర్చించి అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జేఈవో ఆదేశించారు. బ్యారికేడ్లు, విఐపి ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భక్తులు కూర్చునేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్వీబీసీ అధికారులకు ఆమె సూచించారు.

ఎస్ ఈ శ్రీ జగదీశ్వర రెడ్డి, విజివో శ్రీ మనోహర్, డి ఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, శ్రీనివాస కల్యాణం దాత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమార స్వామి ప్రతినిధి శ్రీ అశ్విన్, బెంగుళూరు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది