POURNAMI GARUDA SEVA HELD _ వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 08 DECEMBER 2022:The monthly Pournami Garuda Seva was held in Tirumala on Thursday evening.

Sri Malayappa Swamy in all His religious splendour took out celestial ride along the four mada streets on the mighty Garuda Vahanam between 7pm and 9pm to bless the devotees.

TTD EO Sri AV Dharma Reddy, DyEO Sri Harindranath, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2022 డిసెంబర్ 08 ;తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.