PUSHKARINI AND KALYANAKATTA COMMENCES AT BENGALURU SV TEMPLE _ బెంగళూరు శ్రీవారి ఆలయంలో పుష్కరిణి, కళ్యాణకట్టను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్ 

TIRUPATI, 07 MAY 2023: The sacred temple tank, Pushkarini and tonsuring area-mini Kalyanakatta commenced in the premises of Sri Venkateswara temple at Bengaluru by TTD Chairman Sri YV Subba Reddy on Sunday.

Speaking on the occasion, the TTD board chief said, the Puhskarini and Kalyanakatta were constructed at Rs.7lakhs for the sake of devotees who could not make it to Tirumala. 

Along side Pushkarini, the TTD Trust Board Chairman also commenced Kalyanakatta, Prasadam Sales Counter, TTD products counter, TTD Seva tickets counter.

Local Advisory Committee Chairman Sri Sampath Ravi Narayan, Vice-Chairman Sri Radhakrishna, Secretary Sri Bhaktavatsala Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బెంగళూరు శ్రీవారి ఆలయంలో పుష్కరిణి, కళ్యాణకట్టను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

తిరుపతి, 2023 మే 07: బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మించిన స్వామివారి పుష్కరిణి, కల్యాణకట్టను ఆదివారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ రూ.7 లక్షల వ్యయంతో ఇక్కడ పుష్కరిణి నిర్మించామని, తిరుమలకు రాలేని భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించి, స్వామివారి పుష్కరిణలో స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరిణిని ప్రారంభించారు. అదేవిధంగా కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయ కేంద్రం, టీటీడీ ఉత్పత్తుల విక్రయ కేంద్రం, టీటీడీ సేవా టికెట్ల కౌంటర్ ను ఛైర్మన్ ప్రారంభించారు. ఇక్కడి టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియో పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో బెంగళూరు స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సంపత్ రవి నారాయణన్, ఉపాధ్యక్షులు శ్రీ రాధాకృష్ణ అడిగ, కార్యదర్శి శ్రీ భక్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.