భక్తులకు ప్రేమ, సహనభావంతో సమాచారం అందిచాలి- జెఈవో

భక్తులకు ప్రేమ, సహనభావంతో సమాచారం అందిచాలి- జెఈవో

తిరుపతి, 2010 సెప్టంబర్‌ 02: శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ప్రేమ, సహనభావంతో సమాచారం అందిచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తితిదే జె.ఇ.ఓ డాక్టర్‌.ఎన్‌.యువరాజ్‌ అన్నారు. గురువారం ఉదయం స్థానిక శ్వేతనందు తిరుమలలో సమాచార కేంద్రాలలో పనిచయనున్న ఉద్యోగులకు ఉద్ధేశించిన మూడురోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ భక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారికి అవసరమైన సమాచారాన్ని ఇ్వవడానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సంస్థలో సంస్థాగతంగా జరిగే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ, అందుకు తగ్గ సమాచారాన్ని అవసరమైనంత మేరకు భక్తులకు తెలియజేయాలని చెప్పారు. సమాచార కేంద్రాలలో ముం ఇచ్చే సమాచారం ద్వారానే భక్తులు తమతమ కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళికలు వేసుకొని తద్వారా శ్రీవారిని దర్శించుకొని సంతృప్తి చెందుతారన్నారు.అయితే ఉద్యోగులు తాము చేసే పనులు పూర్తి నిబద్ధతతో, క్రమశిక్షణతో, సహనం, స్నేహభావంతో మెలుగుతూ భక్తులకు సమాచరం అందిచాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్‌ డాక్టర్‌ సంతాన గోపాలకృష్ణన్‌, నోవాటిస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపోనీకి చెందిన ధర్మేంద్ర, సుబ్రమణ్యం రెడ్డిలు, 30 మంది శిక్షణ తీసుకుంటున్న ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.