Dharma Rakshana Maha Yagam concludes _ ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో పూర్ణాహుతితో ముగిసిన ధర్మరక్షణయాగం

On the Concluding of the 21 days Dharma Rakshana Maha Yagam, Sri Sri Sri Siddeswarananda Bharathi Swamy of Siddeswari Peethadhipathi, Courtallam performed Purnahuthi at S.V.Vedic University Campus in Tirupati on Thursday morning.
 
Sri I.Y.R. Krishna Rao, Executive Officer, Sri D.K.Audikesavulu, Ex-Chairman TTDs, Sri M.K.Singh, C.V&S.O and devotees took part.

ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో పూర్ణాహుతితో ముగిసిన ధర్మరక్షణయాగం

తిరుపతి, 2010 సెప్టంబర్‌ 02: తితిదే హిందూధర్మప్రచార పరిషత్‌ నిర్వహణలో కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆధ్వర్యంలో గీత 21 రోజులుగా జరుగుతున్న ధర్మరక్షణయాగం పూర్ణాహుతితో ముగిసింది. స్థానిక శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శ్రీ మహావిష్ణు యాగశాలలో జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ సిద్దేశ్వరానంది భారతీస్వామి తమ అనుగ్రహభాషణంతో జాతిచైతన్యం కోసం ధర్మరక్షణ యాగాలు అవసరమని చెప్పారు. వ్యక్తిని ధర్మపరునిగా చేస్తే సమాజం ధర్మవంతం అవుతుంది అని ఆయన చెప్పారు. ఏదేశంలో ధర్మం ఎక్కువగా ప్రచారమౌతుందో అక్కడ హింస తగుగుతుంది అని ఆయన చెప్పారు. తితిదే సౌజన్యంతో నిర్వహించిన ఈ ధర్మరక్షణయాగం సశాస్త్రీయంగా జరిగిందని దీని ద్వారా దైవశక్తి మానవులకు ప్రకృతికి సహకరిస్తాయని ఆయన తెలియజేశారు.

ఈ పూర్ణాహుతి కార్యక్రమాలలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, తితిదే పాలకమండలి మాజీ ఛైర్మన్‌ శ్రీ డి.కె.ఆదికేశవులు, తితిదే ఛీఫ్‌ విజిలెన్స్‌ అధికారి శ్రీ ఎం.కె.సింగ్‌ పాల్గొన్నారు. హిందూధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డాక్టర్‌ రాళ్ళబండ కవితాప్రసాద్‌, ఆగమ పండితులు డాక్టర్‌ రాజగోపాల్‌ చక్రవర్తి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.ట