భక్తుల సేవలో శ్రీవారి సేవకులు

భక్తుల సేవలో శ్రీవారి సేవకులు

తిరుమల, సెప్టెంబర్‌- 14,  2009: మానవసేవయే మాధవసేవగా భావించి క్రమశిక్షణ, సేవాతత్పరతకు భక్తిభావాలకు మారుపేరైన శ్రీవారి సేవకులు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను చూసి తరించడానికి తిరుమలకు రానున్న వేలాది మంది భక్తులకు తమ ఉచిత సేవలను అందించనున్నారు.

ఈ బ్రహ్మోత్సవాలలో 2వేల మంది శ్రీవారి సేవకులు తిరుమలకు విచ్చేస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ,ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి వస్తున్నారు. తిరుమలలోని అన్నదానం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, మాఢవీధులు, క్యూలైన్స్‌, ఆలయంముందు, పుష్కరిణి, లడ్డుకౌంటర్‌, విచారణ కేంద్రాలు, హెల్త్‌ సెంటర్స్‌, తదితర విభాగాలలో వీరు తమ సేవలను అందించనున్నారు. వీరిలో విద్యాధికులు, ఉద్యోగస్తులు అధికంగా వుండడం గమనార్హం. శ్రీవారిసేవకుల ఉచిత సేవలకు ప్రతి ఫలంగా తితిదే వారు వీరికి ఉచితభోజనం, వసతి సదుపాయాలతో పాటు శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.