భజన సంప్రదాయ ఆధ్యుడు పురందరదాసు-జె.ఇ.ఓ 

భజన సంప్రదాయ ఆధ్యుడు పురందరదాసు-జె.ఇ.ఓ

తిరుమల, 17 ఫిబ్రవరి – 2013: తమ అద్భుమైన భక్తిరస కీర్తనలతో శ్రీవారికి పదనివేదన చేయడమే కాకుండా భజన సంప్రదాయానికి ఆధ్యుడుగా నిలచిన ”కన్నడ పదకవితా పితామహుడు” శ్రీ పురంధర విఠలదాసు అని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు ఆన్నారు.
 
ఆదివారం తిరుమల ఆస్థానమండపంలో జరిగిన శ్రీ పురంధరదాసు ఆరాధనా మహోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తి.తి.దే దాససాహిత్య ప్రాజెక్టువారు చేపడుతున్న విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ”దాదాపు నాల్గున్నర శతాబ్దాల అనంతరం కూడా శ్రీ పురంధరదాసు ఏర్పాటుచేసిన భజన సంప్రదాయాన్ని కొనసాగిస్తూండడం గొప్ప విషయమన్నారు.
అనంతరం శ్రీ మంత్రాలయ రాఘవేద్ర మఠాధీశులు శ్రీ సుయతీంద్రతీర్థ తమ అనుగ్రహభాషణలో ”శ్రీపురంధరదాసు భజన సాహత్యంతో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించారన్నారు.
 
పాలిజీమర్‌ మఠాధీశులు శ్రీ విద్యాధీశ తీర్థస్వామి మాట్లాడుతూ పురంధరదాసులవారు తమ కీర్తనలతో ఉపనిషత్సారాన్ని మేళవించి సాన్యులు జీవితాలను సంస్కరించారన్నారు.
 
ఈ కార్యక్రమానికి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షించారన్నారు.
 
కాగా సా.6.00 గంటలకు శ్రీవారు దేవేరుల ఉత్సవమూర్తులు నారాయణగిరి ఉద్యానవనాలకు బయలుదేరి, అక్కడ ఉంజల్‌సేవ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్‌.వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన పురంధరదాసు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. అనంతరం రా.8.00 గంటలకు ఆరాధనా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.
 
శ్రీ వేంకటేశ్వరస్వామి కైంకర్యాలు కలియుగ వైకుంఠంగా భాసిల్లే శ్రీ వేంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి అవతరించి నిత్యమూ భక్తులకు దర్శనమిస్తూ వారిని తరింపజేస్తున్నాడు. పిలస్తే పలికే ప్రత్యక్ష దైవమూ, కోరిన వరాలరాయుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన ఈ క్షేత్రంలోని దివ్యమంగళ విగ్రహం, స్వామి పుష్కరిణి, పవిత్ర తీర్థాలు, స్వామికి అతి వైభవంగా జరిగే నిత్య కైంకర్యాలు, స్వామి బ్రహ్మోత్సవాలు మొదలైన విశేషాలు భక్తులకు తెలియజేయాలనే సంక్లపంతో తి.తి.దే శ్రీవారి ప్రధానార్చకులలో ఒకరైన శ్రీమాని అర్చకరామకృష్ణ దీక్షితులుగారిచే రచింపజేసి ”శ్రీ వేంకటేశ్వరస్వామి కైంకర్యాలు” అన్న ఈ గ్రంథాన్ని భక్తులకు అందజేస్తున్నది. ”తిరుమల క్షేత్రదర్శిని” సీరీస్‌లో భాగంగా అందిస్తున్న ఈ ”శ్రీ వేంకటేశఅవరస్వామి కైంకర్యాలు” గ్రంథం వైఖానస ఆగమం ప్రకారం శ్రీ స్వామివారికి జరిగే కైంకర్యాలను కూర్చి వివరంగా తెలుసుకోనేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది.
అథర్వ వేదసంహిత మంత్ర పాఠ సహితం అథర్వవేదం లౌకిక శాంతి, పుష్టి, రక్షణ, వైద్యాది అనేక విషయాలతో కూడి ఉంటుంది. ముఖ్యంగా నక్షత్రశాంతులు, శనైశ్తన గ్రహశాంతులు వంటి అనేక శాంతి క్రియా మంత్రాలతో పాటు అనేక కోరికలను తీర్చగలిగే హోమ ప్రక్రియలను, శాంతిహోమ విధానాలను తెలియజేసే మంత్రాలు ఉన్నాయి.
 
ప్రముఖ వేదవేత్తలు మంత్రానుష్ఠానపరులు బ్రహ్మశ్రీ చిఱ్ఱావూరి శ్రీరామసర్మగారు ఈ బృహుత్‌ వేద గ్రంధాన్ని సరళమైన తెలుగు భాషలో వ్యాఖ్యానించారు. వేదపరిరక్షణలో భాగంగా తి.తి.దే వేద వ్యాఖ్యాన గ్రంథాల్ని ఉద్ధరించి ప్రచురిస్తున్నది. అందులో ఇది అథర్వవేదానికి సంబంధించిన తెలుగు వ్యాఖ్యాన గ్రంథం.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.