TTD APPEALS TO DEVOTEES _ భారతీయులు గానీ, విదేశీయులు గానీ ఇతర దేశాల నుండి భారతదేశంలోకి అడుగుపెట్టిన రోజు నుండి 28 రోజుల పాటు తిరుమల సందర్శనకు రావద్దని విజ్ఞప్తి చేయడమైనది.

Tirumala, 10 Mar. 20: Tirumala Tirupati Devasthanams has appealed to NRI devotees who are coming from overseas or foreigners, not to visit Tirumala for 28 days from the day they have landed in India.

As Tirumala is always abuzz with pilgrim activity, the chances of spreading of Corona Virus is more.

Keeping in view the health safety of lakhs of pilgrims visiting Tirumala, TTD has made an appeal to devotees who are coming from other countries to restrain from Visiting Tirumala for 28 days.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

తిరుమ‌ల‌, 2020 మార్చి 10: భారతీయులు గానీ, విదేశీయులు గానీ ఇతర దేశాల నుండి భారతదేశంలోకి అడుగుపెట్టిన రోజు నుండి 28 రోజుల పాటు తిరుమల సందర్శనకు రావద్దని విజ్ఞప్తి చేయడమైనది.
 
తిరుమలలో నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు ఉంటారు కావున కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా వైరస్ ఒకరి నుండి అనేక మందికి సులభంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉంది. 
 
ఈ కారణం వల్ల ఎక్కువ మంది భక్తుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని విదేశాల నుండి వచ్చే భక్తుల విషయంలో టిటిడి జాగ్రత్తలు పాటిస్తోంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.