PLACE OF WOMEN IN INDIAN CULTURE IS IDEAL-SRI SHAKTI PEETHADHEESWARI MATA RAMYANANDA BHARATI SWAMINI _ భారతీయ సంస్కృతిలో మహిళకు పూజనీయ స్థానం : శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని 

SRI PADMAVATI VIDYA PRAKASINI AWARD CONFERRED ON DR K RAJESWARI MURTHY

 

INTERNATIONAL WOMEN’S DAY OBSERVED WITH ELAN BY TTD WOMEN EMPLOYEES

 

TIRUPATI, 08 MARCH 2023: The international women’s day was observed in a massive and grand manner by the women folk of TTD at Mahati Auditorium in Tirupati on Wednesday.

 

Mata Ramyananda Bharati Swamini, Peethadheeswari of Sri Shakti Peetham who graced the occasion in her Anugraha Bhashanam said women are being worshipped in India and this great culture is a role model to the world. 

 

JEO(H&E) Smt Sada Bhargavi enlightened the women about how to overcome societal challenges with courage and commitment. She also played an audio clip from Kurukshetra war and said even Lord Krishna informs all of us that if a woman is not happy then it ends up in war. For a society to be healthy and prosperous, a woman should be happy”, she concluded.

 

Earlier JEO Sri Veerabrahmam during his welcoming address called upon the women to think about personal health safety. “Due to family responsibilities, a woman never cares about her personal health security. A society will be healthy only if a woman is healthy”, he maintained. Smt Goutami IAS, Smt Sarita IPS, Smt Obulamma-Organic Farmer, Smt Ratna Reddy-Philanthropist, Ms Rajani, International Hockey player spoke on occasion and delivered valuable messages. Smt Swarnalatha Reddy, the spouse of TTD Chairman Sri YV Subba Reddy who graced the occasion as the Chief Guest, told the emergence as supreme force of nature by staying strong during difficult times and embracing up themselves to overcome the troubles with divine power.

 

Later TTD conferred the Award Sri Padmavathi Vidya Prakasini to the doyen, the architect, the centenarian and the living legend Dr K Rajeswari Murthy(102) on the occasion and the Award was received by Dr DM Premavathi, retired Telugu Head of the Department SPW Degree and PG college. 

 

Earlier, an AV on 25 women belonging to various fields was displayed and the light display by women employees on the occasion stood as a highlight of the event.

 

Later Padma Awards were given to meritorious women employees. Retired women employees and blood donors were also felicitated on the occasion followed by prize winners of competitions. 

 

In the evening cultural programmes were performed by women employees which included Yoga, Skit on women empowerment, fancy dress, Sri Krishna Tulabharam epic drama, classical dances etc. which allured the audience.

 

Welfare Officer Smt Snehalata supervised the arrangements. All women officers, doctors and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భారతీయ సంస్కృతిలో మహిళకు పూజనీయ స్థానం : శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని

– మహతిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

– డా. కె.రాజేశ్వరిమూర్తికి శ్రీ పద్మావతి విద్యాప్రకాశిని అవార్డు

– ముగ్గురికి పద్మావతి అవార్డులు ప్రదానం

తిరుపతి, 2023, మార్చి 08: భారతీయ సంస్కృతిలో మహిళకు పూజనీయ స్థానం ఉందని, ఇక్కడ అణువణువునా స్త్రీ తత్వం ఇమిడి ఉందని రాయలచెరువులోని శ్రీ శక్తి పీఠం పీఠాధీశ్వరి శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని తెలియజేశారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో బుధవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని అనుగ్రహ భాషణం చేస్తూ మహిళకు దక్కుతున్న ప్రాధాన్యత దృష్ట్యా భారతదేశంలో ప్రతిరోజు మహిళా దినోత్సవమేనని అన్నారు. మహిళామూర్తి అయిన శ్రీ వకుళామాతకు ఇచ్చిన మాట కోసం శ్రీవారు కలియుగంలో అవతరించి భక్తులను రక్షిస్తున్నారని చెప్పారు. మహిళకు విద్య, వాక్ శక్తి, ఆరోగ్యం, ఆత్మబలం, పరాక్రమం లక్షణాలు ఉండాలని వేదాల ద్వారాతెలుస్తోందన్నారు. మానవశక్తికి దైవశక్తి తోడైతే అనుకున్న లక్ష్యాలు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం అరగంట పాటు ధ్యానం లేదా జపం చేయాలని చెప్పారు. తద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా తయారవుతారని తెలియజేశారు.

జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, మహిళలకు లభిస్తున్న ప్రాధాన్యంతోనే భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోందన్నారు. మహిళాశక్తిని జాగృతం చేయడానికే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారని చెప్పారు.

స్త్రీ చైతన్య స్వరూపమని, మహిళ ద్వారా కుటుంబం, తద్వారా సమాజం చైతన్యవంతం అవుతాయన్నారు. టీటీడీ లో 1542 మంది మహిళా ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని, వీరి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఇటీవల మూడు రోజులపాటు కార్యక్రమం నిర్వహించామన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు.

మహిళకు అవమానం జరిగితే యుద్ధం ప్రారంభమవుతుందని గీతోపదేశంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను అందరికీ వినిపించారు.

జేఈవో శ్రీ వీరబ్రహ్మం స్వాగతోపన్యాసం చేస్తూ, భగవంతుడు సృష్టిలో మహిళలకు ప్రముఖ స్థానం కల్పించారన్నారు . సృష్టికి మూలం మహిళ అని అన్నారు. మనకు కావాల్సిన జ్ఞానాన్ని సరస్వతి, సంపదను లక్ష్మీదేవి, శక్తిని దుర్గాదేవి ఇస్తారని తెలియజేశారు. టీటీడీ లో మహిళా ఉద్యోగులు చక్కగా పనిచేస్తూ సంస్థను ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా మొదటిసారి మహిళా ఉద్యోగులు రక్తదానం చేశారని, ఇది అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఆరోగ్యంపైన జాగ్రత్త వహించాలని కోరారు. జీవిత పరమార్ధాన్ని తెలుసుకుని చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకుండా సంతోషంగా, సంతృప్తిగా, శాంతంగా జీవితాన్ని సాగించాలని సూచించారు.

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి స్వర్ణలత మాట్లాడుతూ, వేదవతి, వకుళమాత , లక్ష్మీదేవి ఈ ముగ్గురు మహిళామూర్తులకు ఇచ్చిన మాట కోసం శ్రీ వేంకటేశ్వర స్వామివారు శేషాచలంపైన అవతరించారని చెప్పారు. ఏ యుగంలో అయినా సనాతన ధర్మం మహిళకు పెద్ద వేసిందని చెప్పారు. పిల్లల పెంపకంలో మహిళలు జాగ్రత్త వహిస్తే సమాజంలో అత్యాచారాలు జరగవన్నారు.

ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన రేణిగుంట ఎలక్ట్రానిక్ మానుఫాక్చర్ క్లస్టర్ సిఈవో శ్రీమతి గౌతమి, సిఐడి మహిళా ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ శ్రీమతి సరిత, జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజని , పారిశ్రామికవేత్త శ్రీమతి రత్నారెడ్డి, ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి ఓబులమ్మ, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డా.ప్రేమావతి ప్రసంగించారు.

ఆకట్టుకున్న జ్యోతినివ్వాలి

మహిళ గొప్పదనం, ఇంట్లో ఆడపిల్లల అవసరాన్ని గురించి టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తల్లిదండ్రులు రచించిన గీతాన్ని వినిపిస్తూ మహిళా ఉద్యోగులందరూ దీపాలతో ప్రదర్శించిన దీప నివాళి ఎంతగానో ఆకట్టుకుంది.

డా.కె.రాజేశ్వరిమూర్తికి శ్రీ పద్మావతి విద్యాప్రకాశిని అవార్డు

టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నడుం బిగించడంతోపాటు ఎంతోమంది విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పిన మొట్టమొదటి ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజేశ్వరి మూర్తికి శ్రీ పద్మావతి విద్యాప్రకాశిని అవార్డును టీటీడీ ప్రదానం చేసింది. డా.కె.రాజేశ్వరి మూర్తి తరఫున డా.ప్రేమావతి ఈ అవార్డును అందుకున్నారు.

పద్మావతి అవార్డులు

టీటీడీ లోని వివిధ విభాగాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా పద్మావతి అవార్డులు ప్రదానం చేశారు. ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి స్టాఫ్ నర్స్ శ్రీమతి హేమసుధ, ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి వెంకటరమణమ్మ, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. ఉమారాణి ఉన్నారు.

రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం

టీటీడీలో మెరుగ్గా విధులు నిర్వహించి విశ్రాంత జీవితం గడుపుతున్న నలుగురు ఉద్యోగులను ఈ సందర్భంగా సన్మానించారు. వీరిలో డాక్టర్ ఝాన్సీ, ఫార్మసిస్ట్ శ్రీమతి సత్యవతి, అధ్యాపకురాలు శ్రీమతి సుశీల, ఏఈఓ శ్రీమతి హంసవేణి ఉన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన మహిళా ఉద్యోగులకు ప్రశంసాపత్రం అందజేశారు. వీరిలో శ్రీమతి ఉషశ్రీ, శ్రీమతి శ్రీవాణి, శ్రీమతి జమున, శ్రీమతి లావణ్య, శ్రీమతి రూప తదితరులు ఉన్నారు.

అనంతరం స్విమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వనజాక్షి ధ్యానం విశిష్టతను తెలియజేసి మహిళా ఉద్యోగులతో ధ్యానం చేయించారు.

ఎస్వీ సంగీతం నృత్య కళాశాల విద్యార్థులు పలు గీతాలకు చక్కటి నృత్య ప్రదర్శన చేశారు. మహిళా ఉద్యోగుల ఆదివో అల్లదివో… నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి మేలుకొలుపు సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణ తులాభారం పౌరాణిక నాటకాన్ని మహిళా ఉద్యోగులు చక్కగా ప్రదర్శించారు.

అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్, గాత్ర సంగీత పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. టీటీడీ ఏపీఆర్ఓ కుమారి పి.నీలిమ, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. కృష్ణవేణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళా డెప్యూటీ ఈఓలు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.