KODANDARAMA SWAMY TEMPLE FETE  _ మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు 

TIRUPATI, 08 MARCH 2023: The annual Brahmotsavams in Sri Kodandarama Swamy temple in Tirupati are set to commence from March 20-28 with Ankurarpanam on March 19 and Koil Alwar Tirumanjanam on March 17.

Everyday there will be vahana sevas between 8am and 9.30am, again 7pm and 8.30pm.

TTD is making elaborate arrangements for the big fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
 
 

మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 08 మార్చి 2023: తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు వైభవంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 19న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహించనున్నారు.

ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

అదేవిధంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి.

వాహనసేవల వివరాలు :


20-03-2023     ధ్వజారోహణం      పెద్దశేష వాహనం


21-03-2023     చిన్నశేష వాహనం హంస వాహనం


22-03-2023     సింహ వాహనం      ముత్యపుపందిరి వాహనం.


23-03-2023  కల్పవృక్ష వాహనం   సర్వభూపాల వాహనం


24-03-2023      పల్లకీ ఉత్సవం          గరుడ వాహనం


25-03-2023      హనుమంత వాహనం     గజ వాహనం


26-03-2023      సూర్యప్రభ వాహనం     చంద్రప్రభ వాహనం


27-03-2023       రథోత్సవం                  అశ్వవాహనం


28-03-2023       చక్రస్నానం               ధ్వజావరోహణం

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.