HARI NAMAJAPAM IS THE BEST MEDICINE FOR ALL AILMENTS-JEO _ భ‌గ‌వంతుని నామ‌స్మ‌ర‌ణ‌తో అన్ని రుగ్మ‌త‌లు తొల‌గించ‌వ‌చ్చు – టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirumala, 16 Mar. 20: The Joint Executive Officer of TTD Sri P Basant Kumar said that chanting of the divine names of Lord Venkateswara is the best treatment for all ailments.

Speaking after kick starting the ten day Srinivasa Veda Mantra Arogya Japa Yajnam at the Asthana Mandapam in Tirumala on Monday evening, the JEO said TTD has launched the unique Yajnam with the objective of achieving total health and peace for entire humanity.

He said major physical and psychological health issues are being cured with the aid of Veda mantras. Indian history has many examples of causing rains with Veda parayanam and performing yajnas to end droughts and any natural calamities.

“TTD is conducting Srinivasa Veda Mantra Arogya Japa Yajnam and Chatur Veda Parayanam at the Asthana mandapam till March 25 with the participation of prominent Vedic exponents. Dhanwantari Maha Yagam will also be observed from March 26-28”, he added.

Dr Akella Vibhishaba Sharma, Project officer of Sri Venkateswara Higher Vedic Studies Institute of TTD said Vedic Pundits from all southern states, exponents in all four Vedas and Five Sakhas are participating in the parayanam every day for ten days.

TTD All Projects Liaison Officer Sri Venkata Sharma, Srinivasa Kalyanam Project OSD Sri Satya Gopal and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

భ‌గ‌వంతుని నామ‌స్మ‌ర‌ణ‌తో అన్నిరుగ్మ‌త‌లు తొల‌గించ‌వ‌చ్చు – టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుమల 2020 మార్చి 16: క‌లియుగంలో భ‌గ‌వంతుని నామ‌స్మ‌ర‌ణ‌తో న‌యంకాని రుగ్మ‌త‌లు, చికిత్స‌లు ఉండ‌వ‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో సోమ‌వారం సాయంత్రం శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం ఘ‌నంగా ప్రారంభ‌మైంది.
 
ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ప్ర‌పంచానికి సంపూర్ణ‌ ఆరోగ్యాన్ని, శాంతి సౌభాగ్యాల‌ను ప్ర‌సాదించేందుకు  టిటిడి ఈ యాగాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. వేద మంత్రమ‌లు దేవ‌త‌ల‌ను స్తుతించే ప‌ర‌మ ప‌విత్ర శ‌బ్ధ‌రాశులు కావున వేద పారాయ‌ణం తాప‌త్రాయ‌ల‌ను తొల‌గిస్తుంద‌న్నారు. మాన‌సికంగా, శ‌రీర‌కంగా, వాచికంగా అనేక రోగాల‌ను వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌తో  న‌శింప‌జేయ‌వ‌చ్చ‌న్నారు. పూర్వ‌కాలం నుండి నేటి వ‌ర‌కు క‌రువు ప‌రిస్థితుల‌లో జ‌పాలు, య‌జ్ఞ – యాగాలు నిర్వ‌హించ‌డం వ‌ల‌న వ‌ర్షాలు సంవృద్ధిగా ప‌డి ప్ర‌జ‌లంద‌రు సుఖ‌సంతోషాల‌తో ఉన్న‌ట్లు తెలిపారు. శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో మార్చి 25వ తేదీ వ‌ర‌కు ప్ర‌ముఖ పండితుల‌తో  చ‌తుర్వేద పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు  వివ‌రించారు.

అనంత‌రం శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ మాట్లాడుతూ శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞంలో ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ పండితులు 4 వేదాలు, 5 శాఖ‌ల‌ను పారాయ‌ణం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి రోజు ఉద‌యం 8.00 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు, తిరిగి సాయంత్రం 4.00 నుండి రాత్రి 7.00 గంట‌ల వ‌ర‌కు 9 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు.  
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ప్రాజెక్టుల లైజాన్ ఆఫీస‌ర్ శ్రీ వెంక‌ట‌శ‌ర్మ‌, శ్రీ‌నివాస క‌ల్యాణం ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ స‌త్య‌గోపాల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.