UGADI FETE CELEBRATED WITH FERVOUR IN MAHATI _ మహతిలో ఘనంగా ఉగాది సంబరాలు

TIRUPATI, 22 MARCH 2023: Sri Sobhakruta Nama Ugadi festivities were observed with utmost spiritual fervour and gaiety by TTD in Mahati Auditorium on Wednesday under the aegis of HDPP and Welfare wings of TTD.

 

Dr Vedantam Vishnu Bhattacharyulu, the professor of National Sanskrit University rendered Panchanga Shravanam followed by Astavadhanam by renowned scholar Sri Amudala Murali which stood as the special attraction of the programme. 

Later the prizes were given away to the winners of Ugadi Competitions which included the employees as well their children. The fancy dress by the children of employees was also held on the occasion. Finally Ugadi Pachchadi was distributed to all those who participated in the Ugadi festivities held at Mahati. 

Chief Audit Officer Sri Sesha Sailendra, Welfare Officer Smt Snehalatha, All Dharmic Projects Officer Smt Vijayalakshmi, Archaka Training Co-ordinator Sri Hemanth Kumar, employees, denizens also participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మహతిలో ఘనంగా ఉగాది సంబరాలు
 
తిరుపతి, 2023 మార్చి 22: టీటీడీ  హిందూ  ధార్మిక ప్రాజెక్టులు, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
 
ఇందులో భాగంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేసశారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. శ్రీ శోభ 
కృత్  నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు.  పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో అధికారులు సన్మానించారు. 
 
ఆ తరువాత శతావధాని శ్రీ ఆముదాల మురళి అష్టావధానం నిర్వహించారు. ఇందులో నిషిద్ధాక్షరి భరత్ శర్మ,  న్యస్తాక్షరి  డా. యువ శ్రీ, సమస్య డా|| మాధవి, వర్ణన డా. సుభద్ర, ఆశువు శ్రీ అంకమ్మ నాయుడు, పురాణ పఠనం శ్రీ ఆదిత్య శర్మ, అప్రస్తుత ప్రసంగం డా. ఇ.జి.హేమంత్‌కుమార్‌ చేశారు. అనంతరం అవధానిని, ఇతర సభ్యులను హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.
 
ముందుగా ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థులు మంగళధ్వని వినిపించారు. ఆ తరువాత ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. 
 
అనంతరం టీటీడీ ఉద్యోగుల పిల్లలతో సాంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఉగాది సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్‌, పద్యపఠనం పోటీలు, పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, సిఏఓ శ్రీ శేషశైలేంద్ర, హిందూ ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీమతి విజయలక్ష్మి , టీటీడీ అర్చక శిక్షణ కోఆర్డినేటర్ శ్రీ హేమంత్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.