UGADI FETE OBSERVED IN ALL LOCAL TEMPLES OF TTD _ టీటీడీ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

TIRUPATI, 22 MARCH 2023: Ugadi festival was observed with religious fervour in all TTD local temples on Wednesday.

In Tiruchanoor, Tirupati Govindaraja Swamy and Kodandarama temples, Srinivasa Mangapuram and outside temples Asthanam, Panchanga Shravanam were rendered and Ugadi Pachchadi distributed to devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

తిరుపతి, 2023 మార్చి 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి ఉత్సవరులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6 గంటల నుంచి పుష్పపల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరిండెంట్ శ్రీ మధు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం జరిపారు.

శ్రీ కోదండరామాలయంలో :

తిరుపతి శ్రీ కోదండరామాలయంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వార్లు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.

శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో :

శ్రీనివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 9 నుండి 10 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి , ఏఈఓ శ్రీ గురుమూర్తి, సూపరిండెంట్లు శ్రీ వెంకట స్వామి, శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇనస్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.