SEVENTH PHASE AKHANDA BALAKANDA ON MARCH 13 _ మార్చి 13న 7వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

TIRUMALA, 02 MARCH 2022: The seventh phase Akhanda Balakanda Parayanam will be held in Nadaneerajanam in Tirumala on March 13 between 7am and 9am.

In this phase, 155 shlokas from Chapter 27 to 35 will be recited by Vedic Scholars, Faculty and students of SV Vedic University, National Sanskrit University, Higher Vedic Studies, Dharmagiri Veda Vignana Peetham will participate in the Parayanam.

SVBC is telecasting live of this program for the sake of global pilgrims.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 13న 7వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

తిరుమల, 2022 మార్చి 02: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మార్చి 13వ తేదీ 7వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

బాలకాండలోని 27 నుండి 32 సర్గల వ‌ర‌కు గ‌ల 155 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.