KOIL ALWAR TIRUMANJANAM PERFORMED IN KRT _ ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

SRI KODANDARAMA SWAMY BRAHMOTSAVAMS IN EKANTAM AT TIRUPATI  

 Tirupati, 11 Mar. 21: In connection with annual brahmotsavams at Sri Kodanda Rama Swamy temple which is scheduled between March 13 and 21, the temple cleansing fete, Koil Alwar Tirumanjanam was performed on Thursday.

The annual brahmotavams in Sri Kodanda Rama Swamy temple will be observed in Ekantam in view of Covid guidelines. 

On Thursday, the entire temple is cleansed with Parimalam a mixture made of kicchiligadda, turmeric, and vermilion and sandal paste. This fete commenced at 6:30am and lasted till 9am. The devotees are allowed for Sarva Darshan from 10am onwards.

Temple Spl.Gr.DyEO Smt Parvati and others were also present.

PARADAS DONATED:

Hyderabad based devotee Sri Sanjay and Smt Prasanna donated Rs.one lakh worth 13 Paradas to the temple which will be used during the festival.

The Ankurarpana for the annual fete will be performed on March 12 while the Dhwajarohanam will take place on Saturday, March 13.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 13 నుండి 21వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
 
ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
 
తిరుపతి, 2020 మార్చి 11: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మార్చి 13 నుండి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
 
 ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, ఎదురు ఆంజనేయస్వామి, శ్రీ  గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ  దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ జి.రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 
ఆలయానికి పరదాలు విరాళం : 
 
శ్రీ కోదండరామాలయానికి గురువారం హైదరాబాదుకు చెందిన శ్రీ సంజయ్, శ్రీమతి ప్రసన్న దంపతులు ఒక లక్ష రూపాయలు విలువైన 13 పరదాలు విరాళంగా అందించారు.
 
మార్చి 12న అంకురార్పణ
 
శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు మార్చి 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఏకాంతంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
 
తేదీ            ఉదయంసాయంత్రం
 
13-03-21 (శనివారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
 
14-03-21(ఆదివారం)     చిన్నశేష వాహనం హంస వాహనం
 
15-03-21(సోమవారం)సింహ వాహనం    ముత్యపుపందిరి వాహనం
 
16-03-21(మంగళవారం) కల్పవృక్ష వాహనం   సర్వభూపాల వాహనం
 
17-03-21(బుధవారం) పల్లకీ ఉత్సవం              గరుడ వాహనం
 
18-03-21(గురువారం) హనుమంత వాహనం  వసంతోత్సవం/గజ వాహనం
 
19-03-21(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
 
20-03-21(శనివారం)   సర్వభూపాల వాహనం అశ్వవాహనం
 
21-03-21(ఆదివారం)   చక్రస్నానం ధ్వజావరోహణం
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.