TTD EO AND ADDITIONAL EO INSPECTS ARRANGEMENTS FOR AP CM VISIT _ ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో

Tirumala, 21 Sep. 20: In view of the visit of Honourable CM of Andhra Pradesh on September 23 and 24 to Tirumala, TTD EO Sri Anil Kumar Singhal along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti inspected the arrangements at Nada Neerajana Mandapam.

The Chief Minister is scheduled to visit Tirumala on the Garuda vahana day to present the official offerings of pattu vastrams on behalf of AP government on September 23. While on September 24 he will take part in Sundarakanda Parayanam at Nada Neerajana Mandapam along with his Karnataka counterpart Sri Yediyurappa.

In this connection, they reviewed the security arrangements from Bedi Anjaneya temple to Srivari temple and special instructions were issued to senior officials concerned.

Later, Additional EO reviewed on the pattern of Sunadarakanda Parayanam programme to be carried out on September 24 and other arrangements at Nada Neerajanam. 

TTD SE-2 Sri Nageswar Rao, Dharmagiri Veda Pathashala principal Sri KSS Avadhani, Srivari temple DyEO Sri Harindranath, SVBC CEO Sri Suresh Kumar participated in the review meeting.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో

తిరుమల, 2020 సెప్టెంబరు 21: రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌నకు సంబంధించిన‌ ఏర్పాట్ల‌ను సోమ‌వారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి ప‌రిశీలించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబ‌రు 23న గ‌రుడ‌సేవ నాడు గౌ.ముఖ్య‌మంత్రి శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించేందుకు తిరుమ‌ల‌కు రానున్నారు.

 ఈ నేప‌థ్యంలో బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి ఆల‌యం వ‌ర‌కు, నాద‌నీరాజ‌నం వేదిక వ‌ద్ద భ‌ద్ర‌త ఇత‌ర ఏర్పాట్లను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. 24న ఉద‌యం 7 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, శ్రీ బిఎస్‌.య‌డ్యూర‌ప్ప నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారు. వేదిక‌పై భ‌ద్ర‌త‌, అలంక‌ర‌ణ‌, కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల్సిన తీరుపై చ‌ర్చించారు. అనంత‌రం గోకులం విశ్రాంతి గృహంలోని స‌మావేశ మందిరంలో ఈ అంశంపై అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి టిటిడి అధికారులు, పండితుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

 ఈ స‌మావేశంలో టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ ఇతర విభాగాధిప‌తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.