TTD GAMES AND SPORTS FETE CONCLUDES _ ముగిసిన టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు 

TIRUPATI, 20 FEBRUARY 2023′  The annual Games and Sports Meet 2023 was concluded on a grand note with the distribution of first, second and third prizes.

Out of 1062 prizes, 483-first, 481-second, 98-third prizes.

Welfare Officer DyEO Snehalata and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ముగిసిన టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు

– మహతిలో వేడుకగా బహుమతుల ప్రదానోత్సవం

తిరుపతి, 2023 ఫిబ్రవరి 20: టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం రాత్రి మహతి కళాక్షేత్రంలో వేడుకగా జరిగింది. సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ శ్రీమతి స్నేహలత ముఖ్య అథితిగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి స్నేహలత మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 2 నుండి 19వ తేదీ వ‌ర‌కు ఉద్యోగులు ఉత్సాహంగా క్రీడ‌ల్లో పాల్గొన్నార‌న్నారు. క్రీడ‌ల్లో విజయం సాధించిన ఉద్యోగులకు ఆమె అభినందనలు తెలియజేశారు.

అంతకుముందు టీటీడీ ఉద్యోగుల పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఉద్యోగులకు మొత్తం 1062 బహుమతులు ఉండగా, 483 మంది ప్రథమ, 481 మంది ద్వితీయ, 98 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు. వివిధ విభాగాల క్రీడా పోటీల్లో 991 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు  పాల్గొన్నారు. వీరిలో 586 మంది పురుషులు, 324 మంది మహిళా ఉద్యోగులు, 70 మంది సీనియర్ అధికారులు, 11 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు.

క్రీడా పోటీల్లో క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించినందుకు గాను టీటీడీ ఉద్యోగి శ్రీ చీర్ల కిరణ్ కు రూ.60 వేల విలువైన క్రికెట్ బ్యాట్ ను డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత అందజేశారు.

అంతకుముందు టీటీడీ వార్షిక క్రీడా పోటీల నివేదికను శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ, పిజి క‌ళాశాల ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఉషారాణి వివరించగా, తెలుగు విభాగాధిప‌తి డా.క్రిష్ణ‌వేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఈ లు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ మల్లిఖార్జున ప్రసాద్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. నారాయణమ్మ, ఎస్పీడబ్ల్యు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.మహదేవమ్మ, ఎస్పీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి భువనేశ్వరి దేవి, సికింద్రాబాద్లోని టీటీడీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సురేంద్ర, సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.