MUSICAL FIESTA ALLURES _ కపిలతీర్థంలో ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు 

TIRUPATI, 20 FEBRUARY 2023: Musical fiesta captivated devotees on Monday at Sri Kapileswara Swamy temple.

On the last day of the ongoing annual brahmotsavams, Harikatha, devotional musical concert by Sri Sabari Girish, Bharatnayam under the guidance of Sri Pavan Kumar were performed.

Special Officer for SVCMD Sri Sesha Sailendra, Principal Sri Sudhakar and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కపిలతీర్థంలో ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుపతి, 2023 ఫిబ్రవరి 20: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద సోమవారం నిర్వహించిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ముందుగా హరికథ గానం జరిగింది. అనంతరం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ రామచంద్ర రావు శ్రీ చంద్రశేఖర్ డోలు, శ్రీ నటరాజ్ నాదస్వరం వాయిద్యాలతో మంగళధ్వని వినిపించారు.

కళాశాల అధ్యాపకులు శ్రీ శబరి గిరీష్ బృందం గాత్రము, శ్రీ జయరాం వాయిలీన్, శ్రీ రఘురాం మృదంగంపై గణపతి భజన…., కపిలేశ్వర స్తోత్రం…., సుబ్రమణ్య భజన ….,గురు భజన…., మృత్యుంజయ భజన…, శివ భజన…., దుర్గ భజన…. తదితర కీర్తనలను అద్భుతంగా ఆలపించారు.

అదేవిధంగా కళాశాల అధ్యాపకులు శ్రీ పవన్ కుమార్ నృత్య పర్యవేక్షణలో విద్యార్థినులు చక్కగా భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఇందులో సరస్వతి పుష్పాంజలి, చంద్ర చూడా, శివన్ మంగళం, శివ స్తుతి…. తదితర కీర్తనలతో పాటు శ్రీశైల మల్లన్న, జానపద నృత్య ప్రదర్శన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రత్యేకాధికారి శ్రీ శేష శైలేంద్ర, ప్రిన్సిపల్ శ్రీ ఎం.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.