MUTYAPU PANDIRI VAHANA SEVA IN KRT _ ముత్యపుపందిరి వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి

Tirupati, 15 Mar. 21: The processional deity of Sri Ramachandramurthy has taken a ride on Mutyapu Pandiri Vahanam on Monday evening. 

In view of Covid, the annual brahmotsavams are taking place in Ekantam. 

Spl Gr DyEO Smt Parvathi and others were present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్యపుపందిరి వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి

తిరుపతి, 2021 మార్చి 15: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమ‌వారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామి అమ్మవారికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.