CHATURVEDA HAVANAM CONCLUDES AT MYSORE DATTA PEETHAM _ మైసూరు దత్త పీఠంలో ముగిసిన చతుర్వేద హవనం

CHAIRMAN OF TTD PARTICIPATES

 

TIRUPATI, 05 SEPTEMBER 2021: The five-day ritual of Chaturveda Havanam concluded in Datta Peetham at Mysore in Karnataka on Sunday in which TTD Chairman Sri YV Subba Reddy participated.

 

Speaking on the occasion, the TTD Board Chief said, seeking the divine blessings for good health, well-being and prosperity of the entire humanity, HH Sri Sri Ganapathi Satchidananda Swamy of Mysore Datta Peetham has organized the auspicious Chaturveda Havanam from September 1 to 5 which concluded on a grand religious note on Sunday.

 

TTD has also taken up various Vedic and religious programmes in the last one and a half years seeking the divine intervention from the dreadful Covid virus. “Apart from this programs like Gudiko Gomata was also taken up on a grand scale across five states in the country and so far Desi Cows were donated to over 100 temples”, he added.

 

Mentioning about the introduction of Govinduniki Go Adharita Naivedyam, the Chairman said, TTD has been offering prasadams to devotees made out of the cereals produced out of Desi cow panchagavya products through natural farming from the past 125 days in Tirumala temple. He also said, the Veda Parayanam and other parayanam programmes taken up by TTD which are being live telecasted across the global for the sake of Srivari devotees have been receiving immense applause.

 

The Pontiff of Datta Peetham also complimented the continuous efforts of TTD in spreading and safeguarding Hindu Sanatana Dharma through various religious and Vedic programmes.

 

Later he offered his blessings and felicitated the TTD Chairman on the occasion. SV Institute of Higher Vedic Studies Dr A Vibhishana Sharma and devotees were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మైసూరు దత్త పీఠంలో ముగిసిన చతుర్వేద హవనం
 
 
 –  వేద పరిరక్షణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు
 
 
 –  దేశ వ్యాప్తంగా గుడికో గోమాత
 
 
ముగింపు సభలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
 
 
చైర్మన్ దంపతులను ఘనంగా సన్మానించిన శ్రీ గణపతి సచ్చిదానంద 
 
 
తిరుపతి 5 సెప్టెంబరు  2021: మైసూరు దత్త పీఠం లో  సెప్టెంబరు 1 వ తేదీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీ శ్రీనివాస పంచాహ్నిక చతుర్వేద హవనం కార్యక్రమం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్వీయ పర్యవేక్షణలో టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఈ కార్యక్రమం నిర్వహించింది. 
 
 
పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, వేదాలను కాపాడే భాద్యత టీటీడీ పెద్ద ఎత్తున నెరవేరుస్తోందని చెప్పారు. దేశంలోని టీటీడీ ఆలయాల్లోనే కాకుండా,  ప్రముఖ ఆలయాల్లో  కూడా ప్రతి రోజు వేద పారాయణం జరిగేలా టీటీడీ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో వేద పారాయణ దారులను నియమించిందని తెలిపారు. భావితరాల భవిష్యత్తు, హిందూ ధర్మ పరిరక్షణకు వేదాలను పరి రక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి మీద ఉందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో గో పూజను అందుబాటులోకి తేవడం కోసం ఏడాదిన్నర క్రితం టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఐదు రాష్ట్రాల్లో 100 ఆలయాలకు గోమాత,దూడ లను అందించామని, దేశంలోని ఏ ఆలయం ముందుకు వచ్చినా ఉచితంగా గోమాత ను అందిస్తామని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ముఖ్య ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇటీవల జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశామని, పనులు త్వరలో పూర్తి చేయించి కుంభాభి షేకం నిర్వహిస్తామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారికి గత 125 రోజులుగా గో ఆధారిత ఉత్పత్తులతో నైవేద్యాలు సమర్పిస్తున్నామని, కలియుగం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
 
 
లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని ప్రార్థిస్తూ  ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.
 
శ్రీ శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణకు టీటీడీ మంచి కార్యక్రమాలునిర్వహిస్తోందని చెప్పారు. అనంతరం శ్రీ సుబ్బారెడ్డి దంపతులకు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పూల మాలలు, శాలువలతో ఘన సన్మానం చేసి ఆశీస్సులు అందించారు. అంతకు ముందు చైర్మన్ దంపతులు దత్త పీఠం లోని సుఖవనంలో పక్షులకు ఆహారం అందించారు.
 
 
టీటీడీ ఎస్వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది