AYODHYAKANDA AKHANDA PARAYANA DEEKSHA CONCLUDES _ మ‌హాపూర్ణాహుతితో ముగిసిన అయోధ్య‌కాండ పారాయ‌ణ‌ దీక్ష

TIRUMALA, 16 NOVEMBER 2021:  The 27-day Ayodhyakanda Akhanda Parayana Deeksha concluded on a grand note in Tirumala on Tuesday.

 

TTD as part of its mission to combat Covid 19 virus, seeking divine intervention, has been doing many Parayana Yaganams from the past one and a half years. In this regard, TTD has successfully completed Akhanda Sundarakanda, Akhanda Balakanda Parayanams and the latest one to add the row is Akhanda Ayodhyakanda.

 

This fete took place at Vasantha Mandapam where the scholars recited 4,308 shlokas from 119 sargas of Ayodhyakanda in 27 days. On the other hand, Ritwiks performed Japa, Tapa, Homam at Dharmagiri Veda Vignana Peetham at Tirumala during these days.

 

On Tuesday, a total of 274 shlokas from 111th – 119th sargas were recited to complete the Akhanda Parayanam. Simultaneously, the 16 Ritwiks performed Sri Sita Lakshmana Anjaneya Smaeta Sri Ramachandra Mula Mantra Japa-Tarpana-Homam at Dharmagiri and culminated the religious event.

 

Temple OSD Sri P Seshadri and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మ‌హాపూర్ణాహుతితో ముగిసిన అయోధ్య‌కాండ పారాయ‌ణ‌ దీక్ష

27 రోజుల పాటు 4,308 శ్లోకాల పారాయ‌ణం

తిరుమల, 2021 న‌వంబ‌రు 16: శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని కోరుతూ తిరుమ‌ల వ‌సంత మండ‌పం, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లలో 27 రోజుల పాటు నిర్వ‌హించిన అయోధ్య‌కాండ‌ పారాయ‌ణదీక్ష మంగ‌ళ‌వారం ముగిసింది. అయోధ్య‌కాండ‌లోని మొత్తం 119 స‌ర్గ‌ల్లో గ‌ల 4,308 శ్లోకాలను పండితులు పారాయ‌ణం చేశారు. అక్టోబ‌రు 21వ తేదీ నుండి జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

చివ‌రి రోజున వసంత మండ‌పంలో పండితులు శ్రీ సీతారామల‌క్ష్మ‌ణుల ఉత్స‌వ‌మూర్తుల‌ను కొలువుదీర్చి పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం సంక‌ల్పం, శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేప‌ట్టారు. చివ‌రి రోజున అయోధ్య కాండ‌లోని 111వ స‌ర్గ నుండి 119వ స‌ర్గ వ‌ర‌కు గ‌ల 274 శ్లోకాల‌ను 16 మంది పండితులు పారాయ‌ణం చేశారు. అనంత‌రం క్ష‌మా ప్రార్థ‌న‌తో ఈ పారాయ‌ణం ముగిసింది.

అదేవిధంగా, చివ‌రి రోజున‌ ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లోని యాగ‌శాల‌లో 16 మంది ఉపాస‌కులు శ్రీ‌ సీతా ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామ‌చంద్ర‌మూర్తి మూల మంత్ర జ‌ప‌-త‌ర్ప‌ణ‌- హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త్రికాల‌పూజ‌, వేద‌పారాయ‌ణం, ప్ర‌బంధగోష్టి చేప‌ట్టారు. ఆ త‌రువాత మ‌హాపూర్ణాహుతితో ఈ దీక్ష ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆల‌య ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి ఇత‌ర అధ్యాప‌కులు, ఉపాస‌కులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.