KAISIKA DWADASI HELD IN TIRUMALA _ శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం

TIRUMALA, 16 NOVEMBER 2021: The idol of Sri Ugra Srinivasa Murthy also known as Venkatatturaivar was taken on a celestial ride along the four Mada streets on the auspicious day of Kaisika Dwadasi on Tuesday at Tirumala.

 

Religious fervour marked the celebration of the annual ‘Kaisika Dwadasi’ at the hill shrine of Sri Venkateswara Swamy as the devotees were mused with devotion to see the procession of Sri Ugra Srinivasa Murthy along with Sridevi and Bhudevi which takes place only on this day in a year. 

 

The procession was carried out before the break of dawn between 4.30 am and 5.30 am, following the age-old practice. Immense importance is attached to the fete, which according to mythology is revered as one of the most important religious events in the Sri Vaishnava Kshetrams (holy places).

 

Later, the priests organised Dwadasi Asthanam to the deities inside the temple. The temple priests read out the story from Kaisika Puranam during the temple court held at Bangaru Vakili. HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bal Reddy, AVSO Sri Surendra were present during the procession and Asthanam.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం

మాడ వీధుల్లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ద‌ర్శ‌నం

తిరుమల, 2021 న‌వంబ‌రు 16: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆల‌య మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి ఉదయం 7 గం.ల వరకు స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రాశ‌స్త్యం..

పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.