MAHA SHANTI YAGAM ENDS WITH MAHA PURNAHUTI _ మ‌హాపూర్ణాహుతితో ముగిసిన మ‌హాశాంతి యాగం

Tirupati, 14 February 2022: The three-day-long Maha Shanti Yagam organised by the TTD for ushering global wellness in the covid environment at Sri Ramachandra Pushkarini concluded on Monday with Maha Purnahuti.

 

TTD JEO Sri Veerabrahmam participated in the event in which 50 ritwicks led by Agama Advisor Sri Srinivasa Dikshitulu as Kankana Bhattar heralded the conclusion of the Yagam after Punya Havachanam, Viswaksena Aradhana, Sankalpa puja, Veda mantras, Homas and Maha Purnahuti.

 

Special Grade DyEO of Sri Kodandarama swamy temple, Smt Parvathi Agama Advisor Sri Vedanta Vishnu Bhattacharyulu, AEO Sri Durga Raju Superintendent Sri Ramesh Kumar, temple inspectors Sri Jayakumar, Sri Muniratnam were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మ‌హాపూర్ణాహుతితో ముగిసిన మ‌హాశాంతి యాగం

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 14: సంక్షేమం కోసం, కోవిడ్‌-19 ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు తిరుప‌తి శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద మూడు రోజుల పాటు నిర్వ‌హించిన మ‌హాశాంతియాగం సోమ‌వారం మ‌హాపూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా పుణ్యాహ‌వ‌చ‌నం, విష్వ‌క్సేనారాధ‌న‌, సంక‌ల్ప‌పూజ‌, వేద‌మంత్రాల న‌డుమ ఋత్వికులు హోమాలు చేప‌ట్టారు. అనంత‌రం మ‌హాపూర్ణాహుతితో ఈ యాగం ముగిసింది. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం వైఖాన‌సాగ‌మ పండితులు శ్రీ శ్రీ‌నివాస దీక్షితులు కంక‌ణ‌భ‌ట్టార్‌గా వ్య‌వ‌హ‌రించారు. 50 మంది ఋత్వికులు పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ జ‌య‌కుమార్‌, శ్రీ మునిర‌త్నం పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.