ADDL.EO INSPECTS ARRANGEMENTS FOR RATHA SAPTHAMI _ రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 27 January 2020: Additional Executive Officer Sri AV Dharma Reddy on Monday morning inspected the elaborate arrangements that are in place for the ensuing Ratha Sapthami festival of February 1.

Speaking to media, he lighted the arrangements erection of temporary sheds and LED screens in four mada streets, distribution of Annaprasadam, buttermilk, drinking water, snacks and hot beverages.

He said additional staffs were roped in on deputations to provide all facilities to devotees on Mada street galleries besides Srivari Sevakulu and sanitation workers under the supervision of senior officials. 

All arrangements made with LED screens so that devotees could witness all vahanams by sitting in galleries.

He said in view of this one day Brahmotsavam, arjitha sevas and privilege darshans were cancelled.

TTD Chief Engineer Sri Ramachandra Reddy, Additional CVSO Sri Siva Kumar Reddy, SE-2 Sri Nageswar Rao, SE (electrical) Sri Venkateswara Rao, VSO Sri Manohar, Anna Prasadam DyEO Sri Nagaraj, catering officer Sri GLN Shastry and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

రథసప్తమి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి
 
తిరుమల, 2020 జ‌న‌వ‌రి 27: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్రవరి 1వ తేదీన జ‌రుగ‌నున్న రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆల‌య మాడ వీధుల్లో చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. 
 
ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఉద‌యం 5.30 గంట‌లకు సూర్యప్ర‌భ వాహ‌నంతో మొద‌లై రాత్రి 9.00 గంట‌ల వ‌ర‌కు వ‌రుస‌గా చిన్న‌శేష‌, గ‌రుడ‌, హ‌నుమంత వాహ‌నాలు, చ‌క్ర‌స్నానం, క‌ల్ప‌వృక్ష‌, స‌ర్వ‌భూపాల‌, చంద్ర‌ప్ర‌భ వాహ‌నాల‌పై స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు. భ‌క్తులు చ‌లికి, ఎండ‌కు, వ‌ర్షానికి ఇబ్బందులు ప‌డ‌కుండా గ్యాల‌రీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు టి, కాఫి, పాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు నిరంతరాయంగా పంపిణీ చేస్తామ‌న్నారు. 
 
గ్యాల‌రీల‌లో ఉన్న భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌కు ఫుడ్ కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. భ‌క్తులకు మ‌రింత మేరుగైన సేవ‌లందించేందుకు అద‌న‌పు సిబ్బందికి డెప్యుటేష‌న్ విధులు కేటాయిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు.ప్ర‌తి గ్యాల‌రీలో శ్రీ‌వారి సేవ‌కులు, ఆరోగ్య సిబ్బంది ఉంటార‌ని, సీనియ‌ర్ అధికారుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌ని తెలిపారు. భ‌క్తులు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి గ్యాల‌రీల్లో వేచి ఉండి వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించాల‌ని కోరారు. భ‌క్తులు వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు వివ‌రించారు. 
 
ముందుగా గ్యాల‌రీల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక షెడ్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. మాడ వీధుల్లో తీర్చిదిద్దుతున్న రంగ‌వ‌ల్లుల‌ను ప‌రిశీలించారు. 
 
అద‌న‌పు ఈవో వెంట టిటిడి  సిఇ శ్రీ రామచంద్రారెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ(ఎల‌క్ట్రిక‌ల్‌) శ్రీ వెంక‌టేశ్వ‌ర‌రావు, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజ‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.