TTD BOARD CHIEF DONATES TEN LACS FOR RAM MANDIR AT AYODHYA _ రామమందిర నిర్మాణానికి టీటీడీ సహకారం అందించండి

Tirupati, 22 Jan. 21: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Friday donated Rs.10lakhs towards the construction of Sri Ram Mandir at Ayodhya.

The TTD Board Chief handed over the cheque for the same to VHP and RSS representatives at his camp office in Tadepallegudem. He said he wanted to donate his bit in this historical Mandir construction.

He also told the representatives of VHP and RSS that he will discuss in the upcoming TTD board meeting about providing financial assistance towards the construction of Ram Mandir on behalf of TTD.

VHP National President Sri Milind Parande, Kshetra Secretary Sri Kesava Hegde, State Vice-President Sri PVS Naidu, RSS representatives Sri Srinivasa Raju, Sri Durgaprasad were also among those who met the Chairman.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

రామమందిర నిర్మాణానికి టీటీడీ సహకారం అందించండి
– చైర్మన్ ను కోరిన విశ్వహిందూ పరిషత్ , ఆరెస్సెస్ ప్రతినిధులు
– తనవంతుగా రూ 10 లక్షలు అందించిన చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి

తిరుమల 22 జనవరి 2021: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి టీటీడీ తరపున సహకారం అందించాలని విశ్వహిందూ పరిషత్,ఆరెస్సెస్ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని కోరారు.

శుక్రవారం సాయంత్రం తాడేపల్లి లోని తన నివాసంలో విశ్వహిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాందే తో పాటు పలువురు చైర్మన్ ను కలిశారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి టీటీడీ తరపున సహాయం అందించే విషయం బోర్డ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ వారికి చెప్పారు.

రామ మందిర నిర్మాణానికి శ్రీ సుబ్బారెడ్డి తన వంతుగా రూ 10 లక్షలు విరాళం చెక్కును వారికి అందించారు.

విశ్వహిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి శ్రీ కేశవ్ హెగ్డే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పివిఎస్ నాయుడు,ఆరెస్సె ప్రతినిధులు శ్రీనివాసరాజు, శ్రీ దుర్గా ప్రసాద్ చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది