EXEMPT Rs 23.78 CRORE GST ON SPF – TTD CHAIRMAN APPEALS TO UNION FINANCE MINISTER _ రూ.23.78 కోట్ల జిఎస్‌టి ర‌ద్దు చేయండి కేంద్ర ఆర్థిక‌మంత్రికి టిటిడి ఛైర్మ‌న్ విన‌తి

Tirupati, 15 Sep. 20: The Centre should exempt the TTD from the burden of GST arrears payable on the services of Special Protection Force (SPF) from the period April 1, 2014, till September 30, 2020, sought TTD Chairman Sri YV Subba Reddy to the Union Finance Minister Smt Nirmala Sitaraman.

He made this appeal when he called on the Union Finance Minister at New Delhi on Tuesday and informed her that this would facilitate TTD providing more financial strength to pursue its social, economical and spiritual activities with more vigorously.

DIRECTION FOR DEPOSITING OLD CURRENCY IN BANKS

He also sought permission for depositing old Rs 500 or Rs 1000 notes contributed by devotees in the temple Hundis either with RBI or other nationalised banks.

He said since the Central government banned Rs 500 or Rs 1000 notes on November 18 in 2016, TTD has made arrangements for cashless transactions in its activities. However, in view of devotee sentiments, TTD could not stop them from contributing old notes in the Srivari Hundi. As a result, nearly 1.8 lakh Rs1000 old notes and 6.34 lakh Rs 500 notes have been accumulated with the TTD coffers since then.

He said correspondence with Union Finance Ministry and RBI on the conversion of old notes since 2017 has not yielded any favourable response till date.

The Chairman said the facilitation of conversion of old notes could embolden the TTD to take up many more religious and service-oriented activities.

He appealed to the Union Finance minister once again to respond favourably to resolve the accumulated old currency notes of ₹1000 and ₹500 at the earliest.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రూ.23.78 కోట్ల జిఎస్‌టి ర‌ద్దు చేయండి

కేంద్ర ఆర్థిక‌మంత్రికి టిటిడి ఛైర్మ‌న్ విన‌తి

తిరుప‌తి, 2020 సెప్టెంబరు 15: తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త కోసం నియ‌మించుకున్న స్పెష‌ల్ ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్‌) విభాగానికి 2014, ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30వ తేదీ వ‌ర‌కు బ‌కాయి ఉన్న రూ.23.78 కోట్ల జిఎస్‌టిని ర‌ద్దు చేయాల‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌ల సీతారామ‌న్‌కు విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం ఢిల్లీలో ఆయ‌న కేంద్ర మంత్రిని క‌లిసి ఈ మేర‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. జి ఎస్టీ రద్దు చేయడం వల్ల టీటీడీ కి మరింత ఆర్థిక బలం లభించి అనేక సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించే అవకాశం కలుగుతుందని శ్రీ సుబ్బారెడ్డి కోరారు.

పాత‌నోట్ల డిపాజిట్‌కు ఆదేశాలివ్వండి

తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వ‌ర‌స్వామివారికి భ‌క్తులు హుండీ ద్వారా కానుక‌లుగా స‌మ‌ర్పించిన రూ.500/-, రూ.1000/- నోట్ల‌ను రిజ‌ర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇత‌ర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయ‌డానికి అనుమ‌తించాల‌ని శ్రీ వైవి.సుబ్బారెడ్డి మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం 2016, నవంబ‌రు 8వ తేదీన రూ.1000/-, రూ.500/- నోట్ల‌ను ర‌ద్దు చేసినప్ప‌టి నుంచి టిటిడి న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డానికి అనేక ఏర్పాట్లు చేసింద‌న్నారు. అయితే భ‌క్తులు ఆ త‌రువాత కూడా స్వామివారికి హుండీ ద్వారా ర‌ద్దు అయిన నోట్లు కానుక‌గా స‌మ‌ర్పిస్తూ వ‌చ్చార‌న్నారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డిన అంశం కావ‌డంతో భ‌క్తులు ఈ నోట్ల‌ను హుండీలో స‌మ‌ర్పించ‌కుండా నిరోధించే ఏర్పాట్లు టిటిడి చేయ‌లేక‌పోయింద‌ని ఆయ‌న చెప్పారు. ఈ ర‌కంగా భ‌క్తుల నుండి 1.8 ల‌క్ష‌ల రూ.1000/- నోట్లు, 6.34 ల‌క్ష‌ల రూ.500/- నోట్లు హుండీ ద్వారా కానుక‌లుగా వ‌చ్చాయ‌న్నారు. అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రుపుతున్న టిటిడి హుండీ ద్వారా ల‌భించే కానుక‌ల‌కు ప‌క్కాగా రికార్డులు నిర్వ‌హిస్తోంద‌ని శ్రీ సుబ్బారెడ్డి మంత్రికి వివ‌రించారు. టిటిడి వ‌ద్ద నిల్వ ఉన్న ఈ నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేయ‌డం ద్వారా ల‌భించే సొమ్ముతో మ‌రిన్ని ధార్మిక‌, సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని చెప్పారు. పాత‌నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టిటిడి అనేక‌సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌, రిజ‌ర్వు బ్యాంకుకు లేఖ‌లు రాసి విజ్ఞ‌ప్తి చేసినా సానుకూల స్పంద‌న రాలేద‌ని ఆయ‌న వివ‌రించారు. భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న ఈ అంశంపై సానుకూల నిర్ణ‌యం తీసుకుని టిటిడి వ‌ద్ద నిల్వ ఉన్న రూ.1000/-, రూ.500/- నోట్ల‌ను రిజ‌ర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇత‌ర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయ‌డానికి త‌గిన ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.