SUNDARA KANDA PARAYANAMS FOR GOOD OF HUMANITY, SAYS TTD EO _ లోక క‌ల్యాణార్థం సుంద‌ర‌కాండ పారాయ‌ణం : టిటిడి ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala, 3 Nov. 20: TTD Executive Officer Dr KS Jawahar Reddy said on Tuesday that TTD has organised the sixth edition of Akhanda Sundara Kanda parayanams for the good of humanity from pandemic Coronavirus.

He participated in the recital of 185 shlokas of 20-24 sargas of Akhanda Sundarakanda parayanams which commenced at the Nada Niranjanam platform, Tirumala on Tuesday morning.

Speaking to media persons, the TTD EO said ever since the COVID-19 rocked the entire world in the last six months, the TTD commenced the Sundarakanda, Virat Parva, and Bhagavad-Gita parakamani at the Nada Niranjanam platform.

He said the spiritual program was continued non-stop at Tirumala since the corona lockdown days and enthused the devotees of Sri Venkateswara through live telecast by the SVBC.

About 200 Veda parayanadars from Dharmagiri Veda vijnan peetham, Acharyas from SV Veda University, SV Higher Vedic studies institute and Pundits from National Sanskrit University ate participating in the unique program.

Acharya Sri KSS Avadhani, principal of Dharmagiri Veda vijnan peetham said TTD was organising the parayanams for last 208 days for the health safety of humanity.

He said the Sundara Kanda parayanams blessed people with both health and prospects.

The cultural richness of the program was further enhanced on the inaugural day with the sankeertan of “ Rama Rama. Bhaje Shesha Sundaram  “ by the Smt Vandana team of TTD SV Music College. The sankeertan of Sri Hanuma…Jai Hanuma by the artists of Annamacharya project provided a melodious finale to today’s program.

Additional EO Sri AV Dharma Reddy, Vice-chancellor of National Sanskrit University Acharya Muraleedhara Sharma, OSD of SV Vedic Higher Studies Institute, Sri Vibhishana Sharma and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

లోక క‌ల్యాణార్థం సుంద‌ర‌కాండ పారాయ‌ణం : టిటిడి ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమల, 2020 న‌వంబ‌రు 03: సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ సుంద‌రకాండ  20 నుండి 24వ‌ సర్గ వరకు ఉన్న మొత్తం185 శ్లోకాల‌తో 6వ విడ‌త అఖండ పారాయ‌ణం నిర్వ‌హించిన‌ట్లు టిటిడి ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌‌వారం ఉద‌యం జరిగిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంలో ఆయ‌న పాల్గొన్నారు.
     
ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ గ‌త ఆరు నెల‌లుగా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందిన‌ప్ప‌టి నుండి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై “సుంద‌ర‌కాండ, విరాట‌ప‌ర్వం, భ‌గ‌వ‌ద్గీత పారాయణం” ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి రోజు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను తిరుమ‌ల‌లో నిరం‌త‌రం కొన‌సాగించ‌నున్న‌ట్లు ఈవో తెలియ‌జేశారు.

అఖండ పారాయ‌ణంలో దాదాపు 300 మంది వేద పండితులు, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్న‌ట్లు వివ‌రించారు.

సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ ‌ప్ర‌పంచ ప్ర‌జ‌ల యోగ‌ క్షేమం కొర‌కు టిటిడి 208 రోజులుగా శ్రీ‌వారి అనుగ్ర‌హంతో మంత్ర పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌స్తున్న‌ట్లు తెలిపారు. సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయ‌ని వివ‌రించారు.

కాగా, టిటిడి ఎస్వీ సంగీత నృత క‌ళాశాల అధ్యాప‌కులు  శ్రీ‌మ‌తి వంద‌న బృందం  ” ‌ రామ రామ …… భ‌జే శేష సుంద‌రం…… ” ‌, అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ గోపినాథ్ బృందం ” శ్రీ హ‌నుమ‌…..జై హ‌నుమ …..అంజ‌లి త‌న‌య జ‌య హ‌నుమ ..‌..” అనే  సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి‌, రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి శ్రీ విభీష‌ణ శ‌ర్మ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.