వివరణ,”ఇదో రకం వేధింపు…!” అని ప్రచురించిన వార్త నిజం కాదు

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ, జూన్‌ 23, 2011

‘ఇదో రకం వేధింపు…!” అని ప్రచురించిన వార్త నిజం కాదు

జూన్‌ 23వ తేదిన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ”ఇదో రకం వేధింపు…!” అని ప్రచురించిన వార్త నిజం కాదు.
 
తితిదే ఆధ్వర్యంలో మాధవం అతిధి గృహ నిర్వహణ ఎఫ్‌.యమ్‌.ఎస్‌. ద్వారా జరుగుతున్నది. అయితే బుధవారం నాడు (జూన్‌22) జరిగిన సంఘటనలో స్థంబించి పోయిన మురుగును పరిశుభ్రం చేయమని అధికారులు పనులు అప్పగించినప్పుడు పనిని చేయకుండా  విధులను బహిష్కరించి కార్మికులు ధర్నాకు దిగి తద్వారా యాత్రికులకు అందించాల్సిన సేవలకు తీవ్రం అంతరాయం కల్గించడం దురదృష్టకరం.
 
డిప్యూటీ ఇఇ శ్రీ యమ్‌.నాగభూషణం విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారి గనుక కొందరు గిట్టని వ్యక్తులు ఆయనపై అసత్య ఆరోపణలు చేయించడం బాధాకరం. ఇక గుత్తేదారు ప్రతినిధి శ్రీనివాసును విధుల నుండి తొలగించడమైనది. మరో విషయం ఏమిటంటే కార్మికులకు సంబంధించిన జీతము, ఇ.పి.ఎఫ్‌., ఇ.ఎస్‌.ఐ.లను సకాలములో వారికి అందే విధముగా కృషి జరుగుతున్నది.  
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి