New Dwajasthambam installation at Sri Padmavathi Ammavari Temple _ అమ్మవారి ఆలయంలో వేడుకగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన 

Tirupati, June 24: The new Dwajasthamba Prathisthapana program performed at Sri Padmavathi Ammavari Temple on 24th June, 2011 Friday morning.  On the occasion of the Poornavaham Specified Authority chairman Sri J.Satyanarayana who attended the program said that the age old wood which was used as Dwajasthambam in Tiruchanoor temple has become old and the TTD has taken a decision to replace a new Dwajasthambam.  Accordingly the Indian Wood Science and Technology, Bangalore has also certified its fitness and recommended for usage after giving medical treatment and guaranteed for 150 years and the pest-free.  The original height of the tree is 38-40 feet came after sizing it to the present required height of 36 feet.  He further said that the old Dwajasthambam is appears to found installed in the year 1836.  For providing gold malam on copper sheet for both Dwajasthambam and Balipeetham the matter was referred to the Trust Board for its approval for usage of 12.140 kgs worked out to Rs.1.12 crores and the same was approved wide TTD Board Resolution 294 dated 30.08.2007 he added.

 

Speaking on this occasion Sri L.V.Subrahmanyam, EO, TTD told the newsmen that the wooden log has brought from Tanjavur, Tamilnaduin the year 2006 and kept in Asthanamandapam of Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor.  The Archakas of Sri Padmavathi Ammavari Temple have noticed that the Dwajasthambam was getted decayed and there was dire necessity to install a new Dwajasthambam in its place by conducting Balalaya and Samprokshanam and other religious ceremonies he added.

 

Dr.N.Yuvaraj, JEO, Sri M.K.Singh, CV&SO, Sri L.Bhaskar Reddy, FA&CAO, Sri Gopalakrishna, Dy.EO, Sri Tirumalachary and Sri Babu Swamy, Archakas, Sri Venugopal, AEO and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అమ్మవారి ఆలయంలో వేడుకగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన
 
తిరుపతి, జూన్‌ 24, 2011: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో భాగంగా శుక్రవారం పూర్ణాహుతి వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా తితిదే సాధికార మండలి ఛైర్మన్‌ శ్రీ జె.సత్యనారాయణ మాట్లాడుతూ వందల ఏళ్ళు వయస్సు కల్గిన కొయ్యకు సంబంధించి గతంలో ధ్వజస్తంభము ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అది బాగా పాతపడినందున,  దాని స్థానంలో నూతన ధ్వజస్తంభమును ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని టిటిడి గుర్తించినదని ఆయన తెలిపారు.
 
ప్రస్తుతం ఆలయంలో ప్రతిష్ఠించిన ఈ ధ్వజస్థంభము దాదాపు 36 అడుగుల ఎత్తు వున్నదని, 8 1/2 కేజీల బంగారాన్ని వాడడం జరిగిందని ఆయన అన్నారు.అనంతరం ఇఓ శ్రీ ఎల్‌.వి. సుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి జూన్‌ 21న అంకురార్పణ, 22న హోమ కార్యక్రమాలు – కళాకర్షణ, 23న హోమ కార్యక్రమాలు, 24న మహాపూర్ణాహుతి, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, కుంభ ప్రోక్షణ నిర్వహించామని తెలిపారు. ఈ నూతన ధ్వజ స్తంభమును బెంగుళూరుకు చెందిన భారతీయ వృక్షశాస్త్ర నిపుణులు ధ్రువీకరించిన తర్వాతనే ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి తితిదే ఫారెస్ట్‌, ఇంజనీరింగ్‌, జ్యువెలరీ విభాగాలు చక్కగా కృషి చేశాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ యన్‌.యువరాజ్‌, ముఖ్య భద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్‌, ఆర్థిక సలహాదారు శ్రీ యల్‌.భాస్కర్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ గోపాలకృష్ణ, అర్చకులు తిరుమలాచార్యులు, బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.

తితిదే కేంద్రీయ వైద్యశాలనందు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని తితిదే ఇఓ శ్రీ ఎల్‌.వి.సుబ్రమణ్యం ఈ నెల 27వ తేదిన ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. కనుక మహిళా ఉద్యోగులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించు కోవాల్సిందిగా కోరడమైనది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.