వివరణ (20-1-2009)

”తి.తి.దేలో ఆదాయపన్ను అధికారుల తనిఖీ” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ

విషయం :- 20-1-2009 తేదిన ఈనాడు దినపత్రిక చిత్తూరు జిల్లా ఎడిషన్‌లో ”తి.తి.దేలో ఆదాయపన్ను అధికారుల తనిఖీ” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ.

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల జీతాల చెల్లింపులో భాగంగా ఆదాయపన్ను శాఖ అధికారులు రికార్డులు తనిఖీ చేశారని ఈనాడు కథనంలో పేర్కొనడం పూర్తిగా వాస్తవదూరం. తిరుమల తిరుపతి దేవస్థానం పత్రికా ప్రకటన బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లులు ఇతర బిల్లులలో నిబంధన ప్రకారం ఆదాయపన్నును ముందుగానే మినహాయించి (ఊబిని ఖిలిఖితిబీశిరిళిదీ బిశి రీలిజీఖీరిబీలి -ఊఈఐ) ఆదాయపన్నుశాఖకు చెల్లింపులు జరుపుతుంది. ప్రతిసంవత్సరం ఆదాయపన్ను అధికారులు ఈ టి.డి.యస్‌ లను రొటీన్‌గా పరీశీలిస్తారు. ఇవి తనిఖీలు కావు. తి.తి.దే ఉద్యోగులు ఆందోళన చెందారని పేర్కొనడంకూడా అవాస్తవం.

ఈ వివరణను ఈనాడు పత్రికలో ప్రముఖంగా ప్రచురించాలని మనవి చేయుచున్నాము.

తి.తి.దే, ముఖ్య ప్రజాసంబందాధికారి
కె.రామపుల్లారెడ్డి