TTD CENTRAL DHARMIC COUNCIL MEETING _ తి.తి.దే ధార్మిక సలహామండళ్ళతో సమావేశాలు 

Tirupati 20 January 2009: The TTDs Central Dharmic Council’s meeting is held at the Meeting Hall, TTD Administrative Building, Tirupati on Tuesday has taken the following decisions:

·         Decided to conduct special meetings with members of District level Dharmic council of TTD on February 7 in all the districts of A.P.

·         Decided to conduct sadassu with Peetadhipathis and Matadhipathis at Asthana Mandapam, Tirumala on February 28.

·         The imprest amount is enhanced to 3 lakhs. At present it is one lakh and the same amount will be spent for Dharmic activities through DPP co-ordinators with the help of the Dharmic council.

·         Requested the Peetadhipathis to send the names of their disciples so as to enroll their names as members of TTD District level Dharmic councils.

·         To encourage Bhajan culture in Dalithwadas, Girijan areas Bhajan programmes (Bhajan competitions) will be conducted in the Mandal level in February. The winners can participate in District level and finals will be held at Tirupati.

·         The council has also decided to conduct Gita Govindam in all the districts to the prisoners in the Jails for every month, especially during second Saturdays, Sundays.

·         It is decided to conduct a co-ordination meeting with all the Endowment 6A Temples, Executive Officers, Chairman, Endowment Commissioners, Secretary, TTD Executive Officer, Central Dharmic Council Members in presence of the Endowment Minister so as to plan Dharmic Pracharam effectively. This co-ordination meeting will be held in the month of february 2009 in Hyderabad.

Sri K.V.Ramanchary, Executive Officer, Sri V.Seshadhri, Joint Executive Officer, Sri Potluri Venkateswara Rao, Sri Ravva Sri Hari, Sri Parigi Vasantha Kumar, Sri Konajeti Subba Rao, Sri Lakshmi Kantham Sresta, Sri Murali Mohana Raju, Sri Venkata Ramana, Dr Vijaya Raghava Charyulu, Secretary DPP, Sri Surya Narayana, Adm Officer, DPP and others have participated

ISSUED BY THE PUBLIC RELATION S OFFICER, TTDs, TIRUPATI

తి.తి.దే ధార్మిక సలహామండళ్ళతో సమావేశాలు

తిరుపతి, జనవరి-20, 2009: మన సనాతన సంస్కృతి, ధర్మ పరిరక్షణకు, ప్రజలలో దైవ భక్తి, ధార్మిక చింతన, విలువలను పెంపొందించే దిశగా కార్యక్రమాలు నిర్వహించేందుకు పిబ్రవరి 7వ తేదిన రాష్ట్రంలో అన్ని జిల్లాలో వున్న తి.తి.దే ధార్మిక సలహామండళ్ళతో సమావేశాలు నిర్వహించాలని తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి చెప్పారు.

మంగళవారం ఉదయం తి.తి.దే పరిపాలనా భవనంలో జరిగిన కేంద్రీయ ధార్మిక సలహామండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 28వ తేదిన తిరుమల ఆస్థానమండపంనందు పీఠాధిపతుల సదస్సు నిర్వహించాలని, ఫిబ్రవరి 7వ తేదిన అన్ని జిల్లాలలో మండలస్థాయి భజన పోటీలు నిర్వహించాలని, అదేవిధంగా గెలుపొందిన వారికి పిదప జిల్లా స్థాయిలోను పిదప రాష్ట్రస్థాయిలో తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా గీతాగోవిందం కార్యక్రమాన్ని నెలకొక్కమారు అన్ని జిల్లాలలోని జైళ్ళలో ధార్మిక సలహామండలి ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ధార్మిక ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టడానికి గాను రాష్ట్రంలోని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న ప్రముఖ దేవాలయాల ఛైర్మెన్‌లు, ఇ.ఓ.లు, ఎండోమెంట్‌ కమీషనర్‌, సెక్రటరీ, తి.తి.దే ధార్మిక సలహామండలి సభ్యులు, అధికారులతో కలిపి దేవాదాయశాఖామంత్రి సమక్షంలో ఒక సమన్వయ సమావేశం ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించారు.

ధార్మిక సలహామండలి సలహామేరకు ఆయా జిల్లాలో ఉండే డి.పి.పి. కో-ఆర్డినేటర్‌లకు ప్రస్తుతం ఇస్తున్న లక్షరూపాయలకు అదనంగా మరో రెండు లక్షలు రూపాయలను (మొత్తం మూడు లక్షలరూపాయలు) మంజూరు చేసి వారి ద్వారా ధార్మిక సలహామండళ్ళ సహకారముతో ధార్మిక, భక్తి, ఆధ్యాత్మిక, భజనకార్యక్రమాలను రూపొందించాలని నిర్ణయించారు. ఆదే విధముగా జిల్లాలో ధార్మిక సలహామండలి సభ్యుల సంఖ్య 15 నుండి 20కి పెంచాలని, ఆయా ప్రాంతాలలో ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులు సైతం తమ తమ శిష్యులను కూడా ఈ సలహామండళ్ళలో సభ్యులుగా ఉండడానికిగాను పేర్లను సూచించాల్సిందిగా కోరడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రీయ ధార్మిక సలహామండలి సభ్యులు శ్రీపొత్తూరి వెంకటేశ్వరరావు, మురళీకృష్ణమరాజు, ఓ. వెంకటరమణ, పరిగి వసంతకుమార్‌, కొనజేటి సుబ్బారావు, లక్ష్మీకాంతం శ్రేష్ఠ, రవ్వా శ్రీహారి, జె.ఇ.ఓ. శేషాద్రి, డి.పి.పి. సెక్రటరీ, డాక్టర్‌ విజయరాఘవాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

అంతకుమునుపు శ్రీ కె.వి. రమణాచారి గారు హైందవధర్మ ప్రచారం చేస్తున్న మాలదాసర్ల సంఘం సభ్యులకు ధర్మప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో తంబూరలు, అక్షయపాత్రలు, చిడతలు బహూకరించారు.
ఈ సందర్బంగా ఇఓ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో మాలదాసర్లకుగాను 20 సెట్ల అక్షయపాత్రలు, తంబూరలు ఉచితంగా ఇస్తామని, అదేవిధంగా మైక్‌సెట్లుకూడా త్వరలో ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మాలదాసర్లు తమ పిల్లలను భాగా చదివించాలని, ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు తి.తి.దే. ఇస్తున్న మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం వుటుందని తెలిపారు.

ఈ సంధర్భంగా దాదాపు 100 మంది మాలదాసర్లకు ఆయన అక్షయ పాత్రలు, చిడతలు, తంబూరలు పంపిణీ నేడు చేయగా, మలివిడతలో మిగిలిన 360 మందికి పంపిణీ చేస్తారు. ఒక్కొక్క అక్షయ పాత్ర విలువ రు.1600/- కాగా ఒక్కొక్క తంబూర రు.3800/-లు.

ఈ కార్యక్రమాల్లో తి.తి.దే. జె.ఇ.ఓ. వి.శేషాద్రి మాలదాసర్ల సంఘం అధ్యకక్షులు దొమ్మలపాటి నారాయణ, నల్గొండ, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, జిల్లాల నుండి వచ్చిన అనేక మంది మాలదాసర్లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.