MANUSCRIPTS DIGITIZATION UNDER SVVU _ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తాళ పత్రాల డిజిటైజ్

SPEED UP GHEE PLANT WORKS -TTD EO

 

TIRUPATI, 24 FEBRUARY 2023: The digitization of Manuscripts should be carried out by Sri Venkateswara Vedic University, said TTD EO Sri AV Dharma Reddy.

 

Review meeting with Senior Officers’  of TTD was held at Sri Padmavathi Rest House in Tirupati on Friday. The EO directed the officials of SVVU to speed up the works of scanning of Manuscripts. He also instructed the concerned to complete the onoing Ghee Plant works at SV Dairy Farm on a fast pace.

 

Speaking on Yoga Darsanam the EO said, the programme got immense appreciation from devotees and said SVBC should take the essence embedded in Yoga Shastra in a big way to public by designing more such informative programmes. He also said, SVBC YouTube should also present programmes on health, hygienic food, science and technology with eminent scholars.

 

Later he also reviewed on Gardens to be developed in Tirumala, more publicity on Cochlear, Smile Train programmes in BIRRD, Sravanam Project etc.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, FACAO Sri Balaji, DLO Sri Reddeppa Reddy, CE Sri Nageswara Rao and other officials were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తాళ పత్రాల డిజిటైజ్

– నెయ్యి తయారీ ప్లాంట్ పనులు సకాలంలో పూర్తి చేయాలి

– టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుపతి 24 ఫిబ్రవరి 2023: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తాళ పత్రాల డిజిటైజ్ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్వీ గోసంరక్షణ శాలలో నిర్మిస్తున్న నెయ్యి తయారీ ప్లాంట్ భవనాలు, యంత్రాల ఏర్పాటు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఆయన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యోగ శాస్త్రాన్ని, అందులో దాగి ఉన్న విజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ప్రసారం చేసిన యోగ దర్శనం కార్యక్రమానికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన చెప్పారు.

యోగ వల్ల కలిగే ఉపయోగాలు, దాని ప్రాముఖ్యతను వివరించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.

ఇంకా వెలుగులోకి రాని తాళపత్రాలను స్కానింగ్ చేసే ప్రక్రియను వేద విశ్వవిద్యాలయం వేగవంతం చేయాలన్నారు. ఎస్వీబీసి యూట్యూబ్ లో ఆరోగ్యం, ఆహారం, జ్ఞానం, విజ్ఞానానికి సంబంధించి అంశాలపై నిపుణుల చేత ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలన్నారు. టీటీడీలో రికార్డుల నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లను త్వరగా ఖరారు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఈవో చెప్పారు. తిరుమలలో ఉద్యానవనాల నిర్వహణ మరింత ఆకర్షణీయంగా ఉండాలని, కొత్తగా ఉద్యానవనాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమి చదును కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బర్డ్ ఆసుపత్రిలో స్మైల్ ట్రైన్, కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లను ప్రజలకు మరింత చేరువ చేయాలని శ్రీ ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రవణం ప్రాజెక్టును ఇకపై బర్డ్ ద్వారా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓశ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసి సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ఎఫ్ఎసిఎవో శ్రీ బాలాజి, డిఎల్వో శ్రీ రెడ్డెప్పరెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు తో పాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది