SPECIAL ARRANGEMENTS FOR ENSUING SUMMER VACATION PILGRIM RUSH- TTD ADDITIONAL EO _ వేసవిలో భ‌క్తుల‌కు ప్ర‌త్యేక‌ ఏర్పాట్లు : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 10 Mar. 20: In view of anticipated heavy rush during ensuing summer season, TTD is making elaborate special arrangements said TTD Additional Executive Officer Sri AV Dharma Reddy.

SUMMER ARRANGEMENTS:

Addressing media persons at the Annamaiah Bhavan in Tirumala on Tuesday morning he said that white cool painting would be done once in a week to provide relief to devotees from scorching heat at all roads and pedestrians pathways where pilgrim congregation is more including using Srivari Seva Sadan, Mada streets, first ghat road walkers path etc.

 

He said special sheds will be put up in front of Srivari temple, Vaikuntam queue Complex etc. Adequate stock of laddu Prasadam will be kept handy for summer demands. 

PLASTIC BOTTLE BAN:

Appealed to the devotees seeking them to bring steel, copper or Tupperware bottles to Tirumala along with them in view of ban on use of plastic bottles in Hill town. He said, TTD has put up nearly 150 RO plants all over Tirumala for the benefit of devotees.

ON COVID- 19 (CORONA VIRUS):

The Additional EO said devotees were advised to bring masks and sanitizers to in view of corona virus threat to avoid spread in much congregated place like Tirumala. He said special task forces with thermal guns and medical equipment have been set up at Alipiri and Srivari Mettu footpath routes to detect affected if any pilgrim had symptoms of ever, cough and cold.

In a clarion call, he sought devotees to postpone their visit to Tirumala, if they are suffering from cough, cold and fever as a precaution.

VOLUNTEERS:

He said, nearly 3500 Srivari Sevakulu and 1500 Scouts are being invited to serve during summer. The TTD medical dispensaries are also equipped with ORS packets apart from supply of buttermilk by Annaprasadam wing during summer.

CO-ORDINATION MEETING:

Earlier, the Additional EO reviewed on the summer arrangements and other development works with senior officials on Tuesday morning at Annamaiah Bhavan.

CE Sri Ramachandra Reddy, Srivari temple Dyeo Sri Harindranarh, Dyeos Sri Damodaram, Sri Balaji, Sri Natesh Babu, Sri Selvam, Sri Nagaraja, SE 2 Sri Nageswara Rao, Health officer Dr RR Reddy, HoD IT Sri Sesha Reddy, VSO Manohar and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

వేసవిలో భ‌క్తుల‌కు ప్ర‌త్యేక‌ ఏర్పాట్లు :  టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2020 మార్చి 10: వేస‌విలో తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిటి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సాయంత్రం మీడియా  స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల‌తోపాటు, భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాలు, రెండు శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌లు, అక్క‌గార్ల‌గుడి, మొద‌టి ఘాట్ రోడ్ల‌ల‌లో వారానికి ఒక సారి వైట్ కూల్ పెయింట్ వేసి కాలిన‌డ‌క భ‌క్తుల‌కు ఎండ వేడి నుండి ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తున్న‌ట్టు తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యం ముందు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల‌లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు.  వేస‌విలో భ‌క్తుల ర‌ద్ధీకి అనుగుణంగా అద‌నపు ల‌డ్డూల‌ను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల‌ నిషేదం వ‌ల‌న భ‌క్తులు రాగి బాట‌ల్‌, స్టీల్ బాటిల్‌, టెప్ప‌ర్ వెర్ బాటిళ్లు తీసుకురావాల‌ని కోరారు. టిటిడి తిరుమ‌ల‌లో 150 ప్రాంతాల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. వేస‌విలో భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన వ‌స‌తి క‌ల్పించేందుకు కరెంటు బుకింగ్ గ‌దుల‌ను పెంచుతున్న‌ట్లు తెలిపారు. గ‌దులు పొందిన  భక్తులు 24 గంటల్లోగదులు ఖాళీ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

కరోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా తిరుమలకు వచ్చే భక్తులు మాస్కులు, శానిటైజర్లు వినియోగించాల‌న్నారు. వైరస్ ల నివారణకు రద్దీ ప్రాంతాల్లో ప్ర‌తి రెండు గంల‌కు ఒక‌సారి రోగ నివారణ మందులతో పరిశుభ్రం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అలిపిరి, శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాల‌లో ప్ర‌త్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. భ‌క్తులు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబుతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వారికి థ‌ర్మ‌ల్ గ‌న్‌లతో వైరస్ బాధితులను గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాలు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లో ప్ర‌తి నిత్యం వేలాది మంది భ‌క్తులు ఉంటారు కావున జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రంతో ఉన్న‌వారు ద‌య‌చేసి త‌గ్గిన త‌ర్వాత మాత్ర‌మే తిరుమ‌ల‌కు రావాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

త్వ‌ర‌లో రూ.300- ప్ర‌త్యేక‌ దర్శనం ఆన్ లైన్ టికెట్ల విధానంలో తేదీ మార్చుకునే వెసులుబాటు, ర‌ద్ధు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లో మార్చి 15 నుండి క‌రెంటు బుకింగ్ ద్వారా గదుల కేటాయింపులో కాషన్ డిపాజిట్ విధానం అమలు చేస్తామ‌న్నారు. వేస‌విలో త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే భ‌క్తుల సౌక‌ర్యార్థం క్షుర‌కుల‌ను 3 షిప్టుల‌లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు.

వేస‌వి ర‌ద్దీ దృష్ఠ్యా తిరుమ‌ల‌కు విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు 3500 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 1500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవ‌లందించ‌నున్నార‌న్నారు. స‌ప్త‌గిరుల‌లో అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా కాకుల‌కొండ ప్రాంతాల్లోని తోట్టెల‌లో నీటిని నిల్వ ఉంచ‌డం ద్వారా ప్ర‌మాదాలు నివారించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. తిరుమ‌ల‌లోని అతిథి భ‌వ‌నాలు, వ‌స‌తి స‌మూదాయాలు, సేవా స‌ద‌న్‌ల‌లో అగ్ని ప్ర‌మాదాల‌ నివార‌ణ ప‌రిక‌రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. టిటిడి వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌లోని అన్ని ప్ర‌థ‌మ చికిత్స‌కేంద్రాల‌లో భ‌క్తుల‌కు అవ‌స‌మైన ఒఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుతున్నాం.  

అంద‌కుముందు అద‌న‌పు ఈవో రానున్న వేస‌వి ర‌ద్ధీ సంద‌ర్బంగా తిరుమ‌ల‌లో భ‌క్తుల సౌక‌ర్యార్థం చేయ‌వ‌ల‌సిన ఏర్పాట్ల‌పై  మంగ‌ళ‌వారం ఉద‌యం అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.  

ఈ స‌మావేశంలో  ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ దామోద‌రం, శ్రీ బాలాజి, శ్రీ సెల్వం, శ్రీ నాగ‌రాజు, ఎస్ ఇ -2 శ్రీ నాగేశ్వ‌రావు, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.