DIG INSPECTS VAIKUNTHA DWARA DARSHANAM ARRANGEMENTS IN TIRUMALA _ వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డిఐజి

Tirumala,30 December 2022: Anantapur Range DIG Sri Ravi Prakash on Friday along with TTD CVSO Sri Narasimha Kishore, Tirupati SP Sri Parameswar Reddy inspected the security arrangements for Vaikunta Dwara Darshan at Tirumala.

As part of the security exercise, the DIG went around queue lines at Narayanagiri sheds, Krishna Teja rest house etc. and advised officials to ensure hassle-free bandobust and effective parking arrangements for devotees coming from all regions.

TTD Vigilance and local Police officials were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డిఐజి
 
తిరుమల, 30 డిసెంబరు 2022: అనంతపురం రేంజి డిఐజి శ్రీ రవిప్రకాష్ పోలీసు అధికారులు, టిటిడి నిఘా మరియు భద్రత అధికారులతో కలిసి శుక్రవారం వైకుంఠ ఏకాదశి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద క్యూలైన్లు తదితర ఏర్పాట్లను డిఐజి పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
 
డిఐజి వెంట టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.