ADEQUATE DEVOTEE CENTRIC ARRANGEMENTS AT REPORTING CENTRES OF VAIKUNTA DWARA DARSHAN- TTD ADDL EO(FAC) _ వైకుంఠ ద్వార దర్శనం రిపోర్టింగ్‌ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి : టిటిడి అదనపు ఈవో(ఎఫ్‌ఏసి) శ్రీ వీరబ్రహ్మం

Tirumala,30 December 2022:  TTD Additional EO (FAC) Sri V Veerabrahmaiah on Saturday directed officials that adequate devotee-centric arrangements should be made for Vaikunta Dwara Darshan reporting at all locations.

 

After a review meeting at Annamaiah Bhavan on arrangements for devotees coming for Vaikunta Dwara Darshan, TTD EO(FC) directed officials that devotees with SSD tokens should report at  Sri Krishna Teja rest house and those with SED tickets at ATC circle while with Srivani tickets at VQC-2 main gates.

 

He said an adequate number of Srivari Sevakulu should be deployed at VQC complexes, Narayanagiri sheds, and queue lines where devotees will be provided tiffin, annaprasadam, tea, coffee, milk, drinking water and Medicare. 

 

Similarly, senior officials of all departments are also positioned at VQC should coordinate with their department staff and ensure that devotees are not out to any hardships.

 

He said special focused to be laid on sanitation and toilets maintenance as thousands of devotees would throng Tirumala for Vaikunta Dwara Darshan am.

 

SVBC CEO Sri Shanmukh Kumar, FA&CAO Sri Balaj, CAuO Sri Sesha Shailendra, SE-2 Sri Jagadeeshwar Reddy and other officials were present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠ ద్వార దర్శనం రిపోర్టింగ్‌ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి : టిటిడి అదనపు ఈవో(ఎఫ్‌ఏసి) శ్రీ వీరబ్రహ్మం

తిరుమల, 30 డిసెంబరు, 2022: వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు ఎటిసి సర్కిల్‌ వద్ద, శ్రీవాణి టికెట్లు గల భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2 మెయిన్‌ గేట్‌ వద్ద రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో(ఎఫ్‌ఏసి) శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన అధికారులతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లలో ఉండే భక్తులకు వైద్యం, టిఫిన్‌, అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, తాగునీరు విరివిగా అందించడానికి అవసరమైనంత మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు, శ్రీవారి ఆలయం, కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద భక్తులకు సకాలంలో అవసరమైన సౌకర్యాలు అందించేందుకు విభాగాల వారీగా సీనియర్‌ అధికారులను ప్రత్యేక విధులకు నియమించినట్టు అదనపు ఈవో తెలిపారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ పరిధిలోని సిబ్బందిని సమన్వయపరుచుకోవాలని సూచించారు. వేలాది మంది భక్తులు వస్తున్నందువల్ల పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణపై ఆరోగ్యాధికారి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌ కుమార్‌, ఎఫ్‌ఏసిఏవో శ్రీ బాలాజి, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.