PRIORITY FOR COMMON DEVOTEES ON V DAY- AP ENDOWMENTS MINISTER _ వైకుంఠ ఏకాద‌శినాడు సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

Tirumala, 5 January 2020: Top priority is given for facilitating darshan to the common devotees during Vaikunta Ekadasi and Dwadasi days celebrations in Tirumala by TTD, said Honourable Endowments Minister.

After inspecting the arrangements made for V-day at VQC-2, in the sheds of Narayanagiri Gardens, Mada street galleries and Kalyana Vedika, the state minister for Endowments said he was immensely impressed to that TTD had made all arrangements with covered shelters and toilets to facilitate devotees smooth darshan in spite of inclement weather conditions.

He said once the Vaikunta dwaram is opened up, VIP pass holders would be quickly given Darshan and more time for darshan will be provided for common devotees.

Congratulating the TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy for their stellar efforts in arrangements for Vaikuntha Ekadasi Dwara Darshan, the minister appealed to devotees to beget comfortable Vaikunta dwaram Darshan. 

He later interacted with the pilgrims who expressed their satisfaction over the arrangements.

Earlier Additional EO Sri AV Dharma Reddy accompanied the Endowments minister along with other officials and explained the arrangements.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

వైకుంఠ ఏకాద‌శినాడు సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్

తిరుమల, 05 జ‌న‌వ‌రి 2020: రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యుల ఆదేశాల మేర‌కు తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ టిటిడి అన్ని ఏర్పాట్లు చేప‌ట్టింద‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తెలిపారు. తిరుమ‌ల‌లో ఆదివారం ఆయ‌న వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, క‌ల్యాణ‌వేదిక ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ భ‌క్తుల కోసం ఏర్పాటుచేసిన షెడ్ల‌ను, క్యూలైన్ల‌ను ప‌రిశీలించామ‌ని, వ‌ర్షం ప‌డినా భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా చ‌క్క‌గా ఏర్పాటు చేశార‌ని, అనుబంధంగా మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశార‌ని వివ‌రించారు. గ‌తం కంటే మెర్గుగ్గా ఏర్పాట్లు చేశారంటూ భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలియ‌జేశారు. జ‌న‌వ‌రి 6న వైకుంఠ ద్వారం తెరిచిన అనంత‌రం విఐపి ద‌ర్శ‌నాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి సామాన్య భ‌క్తుల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తామ‌న్నారు. భ‌క్తుల‌కు మెరుగైన ఏర్పాట్లు చేప‌ట్టిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి మంత్రి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. భ‌క్తులు టిటిడికి స‌హ‌క‌రించి సంతృప్తిగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని కోరారు.

మంత్రి వెంట టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఇత‌ర అధికారులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.