SPIRITUAL FERVOUR MARKS VONTIMITTA RATHOTSAVAM _ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

VONTIMITTA, 16 APRIL 2022: The Rathotsavam was organised on the seventh day of ongoing annual Brahmotsavams at the Kodandarama Swamy temple in Vontimitta at YSR Kadapa district witnessed huge gathering of devotees on Saturday.

 

The deities of Sri Kodandarama Swamy with Sita Devi and Sri Lakshmana Swamy were taken in a procession on the chariot through the streets of the historical village, accompanied by bhajans of devotees and priests reciting mantras.

 

The entire area resonated with the divine chantings of Jai Sri Ram raised by large number of devotees who participated in the finely decked chariot procession.

 

The Honourable Minister of Endowments Sri K Satyanarayana along with his family also participated. Temple DyEO Sri Ramana Prasad and other officials were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్‌16: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ‌నివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ‌ రమణప్రసాద్, ఏఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.