KOIL ALWAR TIRUMANJANAM IN SRINIVASA MANGAPURAM TEMPLE _ శ్రీనివాసమంగాపురంలో ఫిబ్రవరి 7న కోయిల్‌  ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 06 FEBRUARY 2023: In connection with the annual brahmotsavams at Srinivasa Mangapuram from February 11 to 19, the Koil Alwar Tirumanjanam will be observed on February 7. 

 

This temple cleansing festival will be observed between 6.30am and 11am. The entire temple premises including the walls, roofs, puja utensils etc.will be cleaned with Parimalam mixture and later the devotees will be allowed for Darshan.

 

The important Vahana sevas includes Dhwajarohanam and Pedda Sesha Vahanam on February 11, Chinna Sesha Vahanam and Hamsa Vahanam on February 12, Simha and Mutyapu Pandiri on February 13, Kalpavriksha and Sarvabhupala on February 14, Pallaki Utsavam and Garuda Vahanam on February 15, Hanumanta, Vasanthotsavam, Swarna Ratham and Gaja on February 17, Suryaprabha and Chandraprabha on February 17, Rathotsavam and Aswa on February 18, Chakra Snanam and Dhwajarohanam on February 19.

 

Every day morning the Vahana Sevas will take place between 8am and 9am and in the evening between 7pm and 8pm. 

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీనివాసమంగాపురంలో ఫిబ్రవరి 7న కోయిల్‌  ఆళ్వార్‌ తిరుమంజనం
 
తిరుపతి, 06 ఫిబ్రవరి 2023: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం లో ఫిబ్రవరి 7వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11 నుండి  19వ  తేదీ  వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు  నిర్వహించనున్నారు . ఈ సందర్బంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఇందులో  భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.  ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
 
వాహనసేవల వివరాలు :
 
11-02-2023 –  ధ్వజారోహణం – పెద్దశేష వాహనం
 
12-02-2023 – చిన్నశేష వాహనం – హంస వాహనం
 
13-02-2023 – సింహ వాహనం – ముత్యపుపందిరి వాహనం
 
14-02-2023 – కల్పవృక్ష వాహనం – సర్వభూపాల వాహనం
 
15-02-2023 – పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) – గరుడ వాహనం
 
16-02-2023 –  హనుమంత వాహనం – వసంతోత్సవం, స్వర్ణరథం, గజ వాహనం
 
17-02-2023 – సూర్యప్రభ వాహనం – చంద్రప్రభ వాహనం
 
18-02-2023 – రథోత్సవం –     అశ్వవాహనం
 
19-02-2023 – చక్రస్నానం – ధ్వజావరోహణం
 
ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆలయ మాడ వీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.