KOIL ALWAR TIRUMANJANAM ON FEB 08 IN KT _ ఫిబ్రవరి 8న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TIRUPATI, 06 FEBRUARY 2023: The temple cleansing fete, Koil Alwar Tirumanjanam will be observed on February 8 in Sri Kapileswara Swamy temple in Tirupati in connection with the annual Brahmotsavams which commences on February 11.

The traditional cleaning fete will be observed on Wednesday between 11:30am and 2:30pm wherein the puja materials will be cleansed.  The devotees will be allowed for darshan only between 8am and 11am and again after 2:3opm till 8pm. 

The important days includes Dhwajarohanam and Hamsa Vahanam on February 11, Suryaprabha and Chandraprabha on February 12, Bhoota and Simha Vahanams on February 13, Makara and Sesha vahanams on February 14, Tiruchi Utsavam and Adhikaranandi Vahanam on February 15, Vyaghra and Gaja Vahanams on February 16, Kalpavriksha and Aswa Vahanams on February 17, Rathotsavam and Nandi Vahanam on the auspicious day of Maha Sivaratri on February 18, Purushamriga, Kalyanotsavam and Tiruchi Utsavam on February 19, NarajaSwamy Suryaprabha Vahanam, Trisula Snanam, Ravana Vahanam and Dhwajavarohanam on February 20.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 8న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, 06 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8న బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 11.30 నుంచి 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

11-02-2023 – ధ్వజారోహణం(మీనలగ్నం) – హంస వాహనం

12-02-2023 – సూర్యప్రభ వాహనం – చంద్రప్రభ వాహనం

13-02-2023- భూత వాహనం – సింహ వాహనం

14-02-2023 – మకర వాహనం – శేష వాహనం

15-02-2023- తిరుచ్చి ఉత్సవం – అధికారనంది వాహనం

16-02-2023 – వ్యాఘ్ర వాహనం – గజ వాహనం

17-02-2023- కల్పవృక్ష వాహనం – అశ్వ వాహనం

18-02-2023 – రథోత్సవం (భోగితేరు) – నందివాహనం

19-02-2023 – పురుషామృగవాహనం – కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం.

20-02-2023 – శ్రీ నటరాజ స్వామివారి సూర్యప్రభ వాహనం – త్రిశూలస్నానం – ధ్వజావరోహణం, రావణాసుర వాహనం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.