GOVT MINT EXPERTS CERTIFY LORD’S JEWELS AS CENT PERCENT PURE _ శ్రీ‌వారి బంగారు వెండి ఆభ‌ర‌ణాలు  పూర్తి స్వచ్చత, నాణ్యత కల్గిన‌వి – డా|| శశిభూషణ్‌

TIRUPATI, December 25:  A team of Govt Mint experts certified that all the gold and silver and precious stones studded jewels in the Srivari temple are genuine and authentic.

 

Submitting the verification reports to Dr.N.Yuvaraj, Joint Executive Officer, TTDs, Tirupati at His chambers in Tirupati on Saturday, Sri Sashi Bhushan, Dy.General Manager, Govt Hyderabad said a Mint committee has been constituted comprising expert Hyderabad, over the request of TTD.

 

Verification of the Jewels for its caratage and purity with the help of fully equipped lab set up is not difficult. But, we have used the verification process with the help of X RAY FLOROCESSBLE instrument inside the temple”, Sri.Sashi Bhushan said.

 

“Our experts worked hard and paid 10 visits to the temple from Feb 2010 to verify the size, colour, quality, purity of the Jewels and other precious jewels of Lord Venkateswara, i.e, Gold 650, Silver 350 which became possible only with the support and co-operation of TTD officials”, he added.

 

For the verifications of Diamonds and Jewels of Lord Venkateswara, the TTD has sought the help of Gemology Lab, Mumbai, Govt Mint, Hyderabad and IT Value assessments experts. Out of three, the Gemology experts have submitted their repot on October 26 and now the Govt Mint, Hyderabad have submitted their report on December 25. The IT Value assessment experts will submit their report in the month of January. Soon after receving all the reports from all the three experts committees, the TTD will submit its report to the Hon’ble High Court of Andhra Pradesh.

 

The Govt Mint experts committee Sri M.Ponnukalai, Sri K.K.Paraakalam, Sri Gopalakrishna, DyEO(Temple), Smt. Susheela, Asst Executive Officer(Inventory) were present.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI.

శ్రీ‌వారి బంగారు వెండి ఆభ‌ర‌ణాలు  పూర్తి స్వచ్చత, నాణ్యత కల్గిన‌వి – డా|| శశిభూషణ్‌

తిరుపతి, 2010 డిశెంబర్‌-25:  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బంగారు, వెండి ఆభరణాలు పూర్తి స్వచ్చత, నాణ్యత కల్గి వున్నవని హైదరాబాద్‌ ప్రభుత్వ మింట్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డా|| శశిభూషణ్‌ చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన తితిదే జె.ఇ.ఓ డా||యన్‌.యువరాజ్‌ను కలసి స్వామివారి ఆభరణాలకు సంబంధించి ఒక నివేదికను సమర్పించారు.

ఈ సందర్భంగా డా||శశిభూషణ్‌ మాట్లాడుతూ గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో నుండి 10 పర్యాయములు శ్రీవారి ఆలయాన్ని సందర్శించి బంగారు, వెండి నగలు, ఆభరణాలను పరిశీలించామని తమ పరిశీలనలో స్వామివారి నగలు ఎన్నో ఏళ్ళుగా స్వచ్చత,నాణ్యత విషయంలోను,పరిమాణం విషయంలోను రిజిష్టర్ల నందు పొందు పరచిన విధంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏ ఒక్క ఆభరణం కూడా బరువు తగ్గడం కానీ, పరిమాణం తగ్గడం కానీ జరగలేదని పూర్తి స్వచ్చతతో వున్నవని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఆయన నేతృత్వంలోని నిపుణుల కమిటీ 650 బంగారు ఆభరణాలు, 350 వెండి ఆభరణాలు, పొదగబడిన రాళ్ళు ప్రత్యేకమైన ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్‌ స్పెక్ట్రోమీటర్‌ అను పరికరంతో నగల స్వచ్చతను ఆధునిక పద్దతులతో పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు.

గత సంవత్సరం శ్రీవారి ఆలయంలో స్వామి వారి బంగారు,వెండి,వజ్ర వైడూర్యములతో కూడిన వివిధ ఆభరణాల స్వచ్చత, నాణ్యతలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా రాజస్థాన్‌, ముంబయ్‌లకు చెందిన జైమాలజీ నిపుణులు, హైదరాబాద్‌ ప్రభుత్వ మింట్‌కు చెందిన నిపుణులు, అదేవిధంగా ఇన్‌కంటాక్స్‌ విలువ నిర్థారణకు సంబందించి కమిటీలను ఏర్పాటుచేసి నివేదికలను అందజేయాల్సిందిగా తితిదే కోరడం జరిగింది.

తితిదే ఆహ్వానం మేరకు రాజస్థాన్‌, ముంబయ్‌లకు చెందిన జెమాలజీ నిపుణులు అక్టోబర్‌ 26వ తేదిన తమ నివేదికను తితిదేకి అందజేసింది. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వ మింట్‌ నిపుణుల కమిటీ శనివారం తమ నివేదికను తితిదేకి అందజేసింది. ఇక ఇన్‌కంటాక్స్‌ విలువ నిర్ధారణకు సంబంధించిన నిపుణుల కమిటీ తమ నివేదికను తితిదేకి అందజేయాల్సి ఉంది. అయితే ఈ కమిటీ సైతం తమ నివేదికను జనవరిలో తితిదేకి అందజేసే అవకాశం వున్నందున, మూడు నిపుణుల కమిటీ నివేదికలను సిద్దంచేసి రాష్ట్ర ఉన్నత నాయస్థానానికి తితిదే నివేదిస్తుంది.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వ మింట్‌ నిపుణుల కమిటీ సభ్యులు శ్రీ యం.పొన్నుకలై, శ్రీ కె.పరాకలం, ఆలయ డిప్యూటీ ఇ.ఓ శ్రీ గోపాల కృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి సుశీల తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.