TTD INVITES EXPERT DOCS AND PARA MEDICAL STAFF FOR FREE MEDICAL SERVICE IN TRIBAL AREAS  _ శ్రీవారి భక్తులకు ఉచితవైద్యసేవలు అందించడానికి అనుభవం కలిగిన వైద్యనిపుణులకు తితిదే ఆహ్వానం

TIRUPATI, DECEMBER 21: The temple administration of Tirumala Tirupati Devasthanams (TTD) has invited the free and voluntary services of experts from medical fraternity during the conduct of Govinda Kalyanams at Tribal areas and Loka Kalyana Rathams in non-tribal areas.

 It may be mentioned here that the chief motto of TTD is to spread Hindu Sanatana Dharma even in remote areas across the state. With this mission, TTD has been organising Govinda Kalyanams in Tribal areas and Loka Kalyana Rathams in non-tribal areas. Apart from this TTD is also conducting free medical camps in rural areas extending medical help to the needy people in those areas.


With an aim to extend further qualitative medication to the needy, TTD has decided to take the services of expert doctors and physicians who could do selfless service with a motto “Sevice to Mankind is Service to God” and invited the application from such aspirants. The interested persons can enclose their bio-data particulars and address and phone numbers to the chief medical officer of TTD who inturn with the support of a panel prepare the district-wise list and use their services whenever TTD performs Govinda Kalyanams and Loka Kalyana Rathams in the respective areas.


The aspirants could send their particulars to the following address:



The Chief Medical Officer,

T.T.D Central Hospital

K.T.Road,
Tirupati-517507
Chittoor District


Andhra Pradesh


Cell Phone no: 98493 77080

Land line No: (0877)-2264371

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 
 
 

శ్రీవారి భక్తులకు ఉచితవైద్యసేవలు అందించడానికి అనుభవం కలిగిన వైద్యనిపుణులకు తితిదే ఆహ్వానం

తిరుపతి, 2010 డిశెంబర్‌-21: హైంధవధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం కావించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారుమూల ప్రాంతాలలో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలలో వైద్యనిపుణులు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఉచితవైద్య సేవలు శ్రీవారి భక్తులకు అందించాలని తితిదే ఆహ్వానం పలికింది.

హిందూ సనాతన ధర్మాన్ని రాష్ట్రం నలుమూలలా విస్తరించాలన్న ధృడ సంకల్పంతో తితిదే గిరిజన ప్రాంతాలలో గోవింద కళ్యాణాలు, ఇతర ప్రాంతాలలో లోకకళ్యాణరథాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా తితిదే ఉచిత వైద్య శిబిరాలను కూడా గిరిజనప్రాంతాలలో, లోకకళ్యాణరథాలు తిరిగే ప్రాంతాలలో నిర్వహిస్తూంది.  ఈ నేపధ్యంలో తితిదే అనుభవం కలిగిన వైద్యనిపుణులను కూడా స్వామివారి సేవలో భాగస్వాముల్ని చేయాలన్న సంకల్పంతో వారికి ఆహ్వానం పలుకుతూంది.

గిరిజన, మారుమూల ప్రాంతాలలో నిర్వహించే వైద్యశిబిరాలలో ప్రతిభకలిగిన, ప్రఖ్యాతిగాంచిన వైద్యులు స్వచ్ఛందంగా పాల్గొనడానికి తమ అర్హత వివరాలను, చిరునామా, ఫోన్‌నెంబర్లుతో పాటు తితిదే ముఖ్యవైద్యాధికారికి పంపవలసినదిగా కోరడమైనది. ఉత్సాహం ఉన్న వైద్యులు, సర్జన్లు, పిజీసియన్లు ఈక్రింది చిరునామాకు తమ పూర్తి వివరాలను పంపగలరు. ఈ విధంగా పేర్లు నమోదు చేసుకొన్న వైద్యుల వివరాలను జిల్లాల వారిగా పట్టికను తయారు చేసి వారి సేవలను వివిధ జిల్లాల్లో కళ్యాణాలు నిర్వహిస్తున్నప్పుడు వినియోగించుకోవడం జరుగుతుంది. ఇత‌ర వివ‌రాల‌కు సెల్ నెం.9849377080
0877-2264371ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.