ASTABANDHANA MAHA SAMPROKSHANA FETE BEGINS AT SV TEMPLE, SRIVARI METTU _ శ్రీ‌వారిమెట్టు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలోఅష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం

Tirupati, 19 October 2021: The Astabandhana Maha Samprokshana fete organised by the TTD at the SV temple, Srivari Mettu, Srinivasa Mangapuram began on Tuesday morning.      

 

 

As part of celebrations, abhisekam and Snapana thirumanjanam and Kshiraduvasam programs were performed for the utsava idols of Sri Bhoga Srinivasa at the Yagashala in the morning followed by the visesha Homas and asta bandhana rituals in the evening.

 

 

On Wednesday Maha Shanti abhisekam, Homas, Purnahuti and avahana Archana will be conducted in the morning between 06-07 am followed by Maha Samprokshana fete.

 

 

Temple AEO Sri Dhananjayudu, Superintendent Sri Ramanaiah and temple Archakas were present.

 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారిమెట్టు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలోఅష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం

తిరుపతి, 2021 అక్టోబరు 19: శ్రీ‌నివాస‌మంగాపురం స‌మీపంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద గ‌ల శ్రీ వేంటేశ్వ‌ర‌ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి.

ఇందులో భాగంగా ఉదయం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం బుధ‌వారం శ్రీ భోగ‌శ్రీ‌నివాస‌మూర్తిని ప్ర‌తిష్టించ‌నున్న నేప‌థ్యంలో ఉద‌యం అభిషేకం, స్న‌ప‌న‌తిరుమంజ‌నం చేప‌ట్టారు. అదేవిధంగా క్షీరాధివాసం నిర్వ‌హించారు. సాయంత్రం విశేష హోమాలు, అష్ట‌బంధ‌నం నిర్వ‌హిస్తారు.

అక్టోబ‌రు 20న‌ ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి, ఆవాహ‌న అర్చ‌న నిర్వ‌హిస్తారు. ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌హాసంప్రోక్ష‌ణ జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ శ్రీ ర‌మ‌ణ‌య్య‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.